ఓంపురి భూత్ కా వీడియో.. పాక్ కథనం ఎంత పిచ్చిగా ఉందంటే... | Pakistani TV anchor claims seeing Om Puri's ghost.

Pak freaky stories on om puri ghost

Pakistan Om Puri, Pak Media Om Puri, Om Puri Death, Pakistan Om Puri Death Story, Pak Om Puri Ghost, Om Puri Revenge, Om Puri Bhooth, Om Puri Ajit Doval Revenge, Om Puri Ghost Video, NSA Ajit Doval, Bollywood Actor Real Ghost, Bhol News Om Puri

Pakistan media hits new low, claims to see Om Puri’s ghost. In CCTV footage a man, wearing white kurta is seen coming out and he was claimed by Pak media to be the ghost of OM Puri who is searching for NSA Ajit Doval to avenge his killling.

ఓంపురి దెయ్యం అంటూ పాక్ కథనాలు

Posted: 04/19/2017 11:21 AM IST
Pak freaky stories on om puri ghost

బాలీవుడ్ లెజెండరీ నటుడు ఓంపురి(66) మూడు నెలల క్రితం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో చనిపోయిన ఆయనకు దేశం మొత్తం ప్రగాఢ సంతాపం తెలిపింది. అయితే గతంలో యూరీ దాడుల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని పాక్ మీడియా కథలు అల్లటం తెలిసిందే.

పాక్ కు మద్ధతుగా మాట్లాడిన ఆయనపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. కానీ, పాక్ మాత్రం ఆయన్ను పొగుడుతూ కథనాలు రాసింది. ఇక ఆయన చనిపోయిన సమయంలో ఆయనది సహజ మరణం కాదని, ఇండియన్ ఆర్మీ టార్చర్ చేయటం మూలంగానే ఆయన ప్రాణాలు వదిలాడంటూ కథలు అల్లింది. ముఖ్యంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విచారణ పేరిట ఆయనను కొట్టడంతో చనిపోయాడని పేర్కొంటూ బోల్ న్యూస్ అనే ఓ ఛానెల్ విచిత్రమైన కథనాన్ని ప్రసారం చేసింది.

 

ఆ తర్వాత ఏమనిపించిందో ఏమో ఆయన దెయ్యం అయ్యాడంటూ మరో స్టోరీని అల్లి ప్రసారం చేసింది. ఆలస్యంగా ఆ కథనం ఇప్పడు మన మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వీడియోలో తెల్లటి కుర్తా ధరించిన వ్యక్తి ఒకరు నడుచుకుంటూ రావటం అందులో ఉంది. అది ఓంపురినే అని, ముంబైలోని ఆయన ఇంటి ముందు సీసీ టీవీల్లో రికార్డయ్యిందని, తనను చంపిన అజిత్ దోవల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకే వచ్చిందని తలా తోక లేని కథనాన్ని టెలికాస్ట్ చేసింది.

దీనిపై సోషల్ మీడియాలో గట్టి కౌంటర్లే వేస్తున్నారు ఇండియన్ యూత్. నాకు తెలిసి ఓంపురి ఆత్మ ఇప్పుడు పాక్ లో, అది కూడా ఆ చానెల్ ఆఫీస్ ముందు ఉండి ఉండొచ్చని ఓ యువకుడు కామెంట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Om Puri  Ghost Video  Ajit Doval Revenge  

Other Articles