టాలీవుడ్, మన మీడియాపై ఎంత దారుణమైన కామెంట్లు చేశాడో చూడండి | Ajay Ghosh controversial Speech on Tollywood.

Ajay ghosh sensational comments on tollywood

Ajay Ghosh, Ajay Ghosh Speech, Ajay Ghosh Controversial, Ajay Ghosh Tollywood, Ajay Ghosh Comments, Emotional Ajay Ghosh, Ajay Ghosh Thappu Thanda Audio launch, Thappu Thanda Audio launch, Ajay Ghosh Tollywood and Media, Ajay Ghosh Telugu Media, Ajay Ghosh Frustration, Prasthanam Fame Ajay Ghosh, Tollywood Actor Ajay Ghosh

Emotional Ajay Ghosh sensational comments on Tollywood at Thappu Thanda Audio launch.

టాలీవుడ్ పై అజయ్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 04/19/2017 08:51 AM IST
Ajay ghosh sensational comments on tollywood

ఫెర్ ఫార్మెన్స్ ఆధారంగా నటులు ఇప్పుడు పర భాషలకు షిఫ్ట్ అయిపోవటం చూస్తున్నాం. అయితే ఒక భాషలో నటించటం మూలంగానే వారికి మిగతా భాషల్లో ఛాన్సులు వస్తున్నాయన్నది అక్షర సత్యం. కానీ, దాన్ని మరిచి వ్యవహరించే విధానం మాత్రం అస్సలు సరికాదు. ప్రస్థానం ఫేమ్ అజయ్ ఘోష్ కామెంట్లు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయి. తెలుగు ఇండస్ట్రీ చాలా వేస్ట్ అన్న తీరుగా అజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

తమిళ్ లో తప్పు తండా అనే చిత్రం ఆడియో లాంఛ్ అయ్యింది. అందులో అజయ్ కూడా నటించాడు. ఈ సందర్భంగా స్పీచ్ ఇస్తూ టాలీవుడ్ పై ఘాటు కామెంట్లు చేశాడీ నటుడు. ఆస్కార్ కోసం సెలక్ట్ అయిన విసరనై సినిమాలో నటించా, నా మాతృ ఇండస్ర్టీ అయిన తెలుగు ఇండస్ర్టీ మాత్రం గుర్తించలేదు.. కాని తమిళ మీడియా గుర్తించి ఇంటర్వ్యూలు అడిగాయి గ్రేట్ అంటూ వ్యాఖ్యానించాడు.

 

''నాకు తెలుగు కంటే కూడా తమిళ ఇండస్ర్టీలో పనిచేయాలని చాలా ఆశ ఉండేది. నేను కమ్యూనిష్టు పార్టీ బ్యాగ్రౌండ్ నుండి రావడం వలన.. తెలుగు ఇండస్ర్టీలో ఇబ్బంది పడ్డాను. కెమెరా ముందు యాక్ట్ చేయడం వచ్చు కాని.. కెమెరా వెనుక యాక్టింగ్ చేయడం రాదు. కాని గ్రేట్ తమిళ ఇండస్ర్టీలో వెట్రిమారన్ నాకు అవకాశం ఇచ్చారు.. ఒక కొత్త జన్మ ఇచ్చారు. తమిళ పీపుల్ గ్రేట్ అంతే. ఇక్కడ బిల్డప్ లు లేవు. తమిళ జనాలకు సోషల్ అండ్ పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువ. శిరస్సు వంచి తమిళ ఇండస్ర్టీ వారికి పాదాభివందనం చేస్తున్నా'' అంటూ స్పీచ్ ఇచ్చాడు ఈ విలన్.

''చెన్నయ్ లో ఖాళీగా ఉన్న ఆటోవాళ్ళు పేపర్ చదువుతుంటారు. అదే మా దగ్గర అయితే పాన్ తింటారని, అలాగే అక్కడి సాంబార్ తింటే మోషన్స్ అవుతాయి. ఇక్కడ తింటే వావ్'' అంటూ ఇలా సెటైరిక్ గా కామెంట్లు చేశాడు. చిన్న చిన్న క్యారెక్టర్ల నుంచి విలనిజం ప్రదర్శించే రేంజ్ కు చేరుకున్న అజయ్ అంటూ ఒకడున్నాడని ప్రపంచానికి తెలియజేసిందే టాలీవుడ్ అండ్ తెలుగు మీడియా. అలాంటిది వాటిపైనే కామెంట్లు చేసిన అతగాడి వ్యవహారంపై ఎలాంటి రియాక్షన్లు ఉండబోతున్నాయో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Ghosh speech  Thappu Thanda Audio launch  Sensational Comments  

Other Articles