పవన్,మహేష్ కాదు... ఆ ముగ్గురే ఇప్పుడు అసలైన టాప్ హీరోలు | Abhishek Nama on Tollywood collections.

Tollywood young producer comments on star heroes

Abhishek Nama, Abhishek Nama Top Heroes, Abhishek Nama Tollywood Collections, Abhishek Nama Movies, Producer Abhishek Nama, Abhishek Nama Distributor, Tollywood Distribution

Producer Abhishek Nama comments on tollywood top heroes and record collections. Nani, Sharwanand and Nikhil are the real heroes now.

టాలీవుడ్ లో కొత్త నిర్మాత వ్యాఖ్యల కలకలం

Posted: 04/03/2017 03:44 PM IST
Tollywood young producer comments on star heroes

ఒకప్పుడు సినిమా రంగంలో హీరోలు నిర్మాణ రంగంలో చాలా తక్కువగా ఉండేవారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి వాళ్లు కూడా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు వేరే బ్యానర్ లలోనే సినిమాలు తీసి పారితోషకం అందుకునేవారు. ఆ తర్వాత పరిస్థితి దారుణంగా మారిపోయింది. హీరోలే సినిమాలను నిర్మించటం, వారి బంధువులు, దగ్గరి మనుషులతో పంపిణీ చేయించటం లాంటి కొత్త కొత్త సాంప్రదాయాలకు తెరలేపారు. దీని ద్వారా  ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారయ్యిందంటే డిస్ట్రిబ్యూటర్ అనే వాడు కనుమరుగు అయిపోయే స్థాయికి చేరుకున్నాడని చెబుతున్నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా.

1975 లో మధుసూదన్ నామా స్థాపించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఈ మధ్యే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. కేశవ, బాబు బాగా బిజీ చిత్రాలను నిర్మించాడు అభిషేక్ నామా. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిణామాలను వివరిస్తూ స్టార్ హీరోలపైన సంచలన వ్యాఖ్యలే చేశాడు. ఒకప్పుడు నైజాంలో 40 మంది పంపిణీ దారులు ఉండేవారు, క్రమక్రమంగా ఇప్పుడు ఆ సంఖ్య కనుమరుగు అయ్యే స్థాయికి చేరుకుంది. నేను, దిల్ రాజు, సునీల్ మాత్రమే మిగిలాం. కొద్దిరోజులు పోతే అసలు డిస్ట్రిబ్యూటర్ అనే పదమే వినిపించకుండా పోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇక కొందరు బయ్యర్లు స్టార్ హీరోల సినిమాలను ఏదో బిల్డప్ కు రిలీజ్ చేసుకుంటారే తప్ప, అసలు దాని వల్ల రూపాయి లాభం కూడా ఉండదని తేల్చేశాడు. భారీ రేటుకు హక్కులు కొంటున్న మరికొందరు పరువు పోతుందన్న ఉద్దేశ్యంతో టాక్స్ కూడా కలుపుకుని షేర్ కలెక్షన్లుగా చెబుతున్నారని, కానీ, అందులో చాలా తేడా ఉంటుందని చెప్పాడు. ఒక్కోసారి పెట్టిన రేటు కూడా కలెక్షన్లు రావని తేల్చాడు. ప్రస్తుతం టాప్ హీరోలుగా ఉన్న వారి సినిమాల కంటే నాని, శర్వానంద్, నిఖిల్ చిత్రాల ద్వారా నాలుగు రూపాయలు డిస్ట్రిబ్యూటర్ వెనకేసుకోగలుగుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే ముందు హీరోలు మారాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అభిషేక్ చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ మొదలైంది.

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Distribution  Abhishek Nama  Star Heroes  

Other Articles