ప్రయోగాలే కాదు.. ఇంట్రెస్టింగ్ టైటిళ్లు కూడా! | Tollywood heroes new concepts interesting titles.

Interesting titles surrounded in tollywood

Tollywood Top Heroes, Tollywood Interesting Titles, Tollywood 2017 Movies, Tollywood Updates, Tollywood Concepts and Titles, Interesting Titles in Tollywood, Prabhas Sahoo Movie, Mahesh Babu Spyder Movie, Akhil Akkineni Second Movie Titles, Tollywood Upcoming Movies, Balayya Tapori Movie

Interesting Titles for Tollywood top heroes upcoming movies. Mahesh Spyder, Prabhas Sahoo, NTR Jai Lava Kusha etc examples.

టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టైటిళ్లు

Posted: 04/03/2017 03:34 PM IST
Interesting titles surrounded in tollywood

ఒక స్టార్ హీరో సినిమా మొదలైందంటే చాలూ అభిమానులు టైటిల్ పై చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. హీరో బాడీ లాంగ్వేజ్, దర్శకుడు కథ కోసం అందించే హింట్ వంటి అంశాలను మైండ్ లో ఎక్కించుకుని టైటిళ్లు ఇవేనంటూ రోజుకో ప్రచారం కల్పిస్తుంటారు. మహేష్ బాబు మురగదాస్ సినిమా విషయంలో గత కొంత కాలంగా ఇదే సీన్ జరుగుతుండటం చూస్తున్నాం. చట్టంతో పోరాటం ఓల్డ్ టైటిల్ తో మొదలుపెట్టి.. వాస్కోడిగామా నుంచి మొదలుపెట్టి ఏజెంట్ శివ, సంభవామి ఇలా కొనసాగి ఇప్పుడు స్పైడర్ దగ్గర బ్రేక్ వేయగా, దాదాపు అదే టైటిల్ కన్ఫర్మ్ అయినట్లు చిత్ర యూనిట్ కూడా హింట్ ఇచ్చేస్తోంది.

ఏదైనా అభిమానుల అత్యుత్సాహం, ఫ్యాన్ మేడ్ పోస్టర్లతోపాటు వాటికి తగ్గట్లు వెబ్ సైట్ల హడావుడి కూడా ఈ విషయంలో కీలకపాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఇది ఒక్క మహేష్ చిత్రంతోనే ఆగిపోలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా ఇది పాకింది. దాదాపు ఐదేళ్ల సుధీర్ఘ సమయం తర్వాత ప్రభాస్ సుజిత్ తో తీయబోయే సినిమా విషయంలో టైటిల్ గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. ఈ సినిమాకు సాహూ అనే టైటిల్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు. బాహుబలి-2 టైటిల్ ట్రాక్ లోని సాహోరో బాహుబలి లిరిక్స్ నుంచి సాహూ అనే పదానికి తీసుకున్నారని, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దీనికి ఎలాంటి చిక్కులు ఉండవు కాబట్టి అదే ఫైనలైజ్ అయ్యిందని వివరణాత్మక కథనాలు రాసేస్తున్నారు.

ఇక మరోవైపు బాలయ్య-పూరీ చిత్రానికి టపోరి, పవన్-త్రివిక్రమ్ సినిమాకు దేవుడే దిగి వచ్చినా అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నాం. ఎన్టీఆర్ జై లవ కుశ, బన్నీ దువ్వాడ జగన్నాథమ్, అఖిల్ చిత్రానికి ఎక్కడ ఎక్కడ ఉందో తారక... ఇలా టైటిళ్లు ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాయి కూడా. మరోవైపు చెర్రీ-సుకుమార్ సినిమా కోసం కూడా ఓ డిఫరెంట్ టైటిల్ ను ఆలోచిస్తున్నాడంట. ఏది ఏమైనా ఇంత కాలం తమ హీరోయిజం దెబ్బతినకుండా, ఫ్యాన్స్ హర్ట్ కాకుండా టైటిళ్లను సెలక్ట్ చేసుకున్న హీరోలు ఇప్పుడు ఇగోలకు పోకుండా కథ విషయంలోనే కాదు, టైటిళ్ల విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Interesting Titles  Top Heroes  

Other Articles

Today on Telugu Wishesh