అఖిల్ ఎక్స్ కి పెళ్లి కుదిరిందంట. వరుడు ఎవరో తెలుసా? | Shriya Bhupal is rumoured to have found her man.

Wedding bells for shriya bhupal with nri

Akhil Ex Girlfriend, NRI Groom Shriya, Shriya Bhupal Marriage, Shriya Bhupal Wedding, Shriya Bhupal Marriage, Shriya Bhupal Wedding Bell, Shriya Bhupal, Shriya Bhupal Akhil Akkineni, Shriya Bhupal Husband, Shriya Bhupal Hubby, Shriya Bhupal Fiancee, GVK Grand Daughter Shriya Bhupal

Akhil's ex-girlfriend to marry NRIP soon. Parents of Shriya Bhupal have selected a NRI groom and she also said to have given her nod. It's buzzed that this is an arranged wedding and is likely to be held soon.

శ్రీయా భూపాల్ పెళ్లి చేసుకోబోతుందా?

Posted: 04/03/2017 04:47 PM IST
Wedding bells for shriya bhupal with nri

అక్కినేని వారసుడు అఖిల్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి కాన్సిల్ చేసుకున్న హైదరాబాదీ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు అయిన శ్రీయా, అఖిల్ తో ప్రేమాయణం, ఆపై ఎంగేజ్ మెంట్ జరగటం, పొరపచ్చాలు రావటంతో బ్రేకప్ పెళ్లి కాన్సిల్ అంతా తెలిసిందే. ఇక ఓ ఎన్నారై వరుడ్ని ఇప్పటికే ఎంపిక చేసిన కుటుంబ సభ్యులు అతి త్వరలోనే శీయ పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.

చిన్న వయసులోనే ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ను ప్రారంభించిన శ్రీయా అలియా భట్, శ్రద్ధా పూర్ లాంటి బాలీవుడ్ స్టార్లకు సైతం పని చేసింది. తెలుగులో కాజల్, శ్రీయా, రకుల్ లాంటి అగ్రహీరోయిన్లకు పని చేసింది. తన కంటే వయసులో చిన్న వాడైన అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపిన శ్రీయా గత డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకుంది కూడా. ఈ మేలో విదేశాల్లో వారి వివాహనికి అన్ని వేడుకలు జరుగుతున్న సమయంలోనే అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ కు గురిచేశారు.

ఇక పెళ్లి కాన్సిల్ అయ్యాక మీడియా కంట పడకూడదని ఈ జంట కొంత కాలం అజ్నాతంలోకి వెళ్లింది. శ్రీయా అమెరికాకు వెళ్లగా, అఖిల్ గోవాలో సరదగా ఎంజాయ్ చేసి వచ్చాడు. తిరొగొచ్చిన శ్రేయా కి విదేశాల్లో సెటిల్ అయిన ఓ వ్యాపారవేత్త తనయుడితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఉత్త గాలి వార్తేనా అన్నది కుటుంబ సభ్యులు తేల్చాల్సి ఉంది. మరోవైపు తన రెండో చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆదివారం మొదలుపెట్టేశాడు అఖిల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  GVK Grand Daughter  Shriya Bhupal  NRI Groom  

Other Articles