తొమ్మిదేళ్ల క్రితం జల్సా.. మరి ఇప్పుడేంటో? | Pawan Trivikram to begin Work for third movie.

Pawan trivikram movie regular shoot start

Pawan Kalyan, Trivikram, Pawan Kalyan Trivikram New Movie, Trivikram Pawan Kalyan, Pawan Anu Emanuel Sets, Pawan New Movie Regular Shooting, Pawan Trivikram Third Movie, Pawan Trivikram, Pawan Keerthy Suresh Movie, Pawan Kalyan New Look

Pawan Kalyan Lands on Trivikram's Sets for new movie. it Combo third movie Regular Shoot Started Today.

త్రివిక్రమ్-పవన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది

Posted: 04/03/2017 12:03 PM IST
Pawan trivikram movie regular shoot start

కాటమరాయుడు మిక్స్ డ్ టాక్ తో పవర్ స్టార్ కి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ హిట్ చాలా అవసరం. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త చిత్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. అల్రెడీ ముహుర్తం లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభం కాగా, పవన్ కూడా సెట్ లో జాయిన్ అయ్యాడు.

గతంలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ఈ కాంబో లో వస్తున్న మూడో చిత్రం కూడా ఖచ్ఛితంగా బ్లాక్ బస్టర్ అయితీరుతుందని అంచనా వేస్తున్నారు. సుమారు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన 5 కోట్ల స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

ఇక గత చిత్రాల్లో పవన్ ను స్టైలిష్ గా చూపించిన త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కూడా కొత్త మేకోవర్ చేయించాడని చెప్పుకుంటున్నారు. ఇందులో ఓ సాఫ్ట్ వేర్ అనాలసిస్ట్ రోల్ లో పవన్ కనిపించబోతున్నాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించబోతున్న ఈ చిత్రంలో కుష్బూ ఓ కీలక రోల్ చేస్తుండగా, ఓ లీడిండ్ నటుడు విలన్ గా చేయబోతున్నాడని టాక్. త్వరగతిన పూర్తి చేసి ఆగష్టు 11న చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  Third Movie  Regular Shoot  

Other Articles

Today on Telugu Wishesh