ధనుష్ హీరోయిన్ షాకింగ్ కామెంట్లు.. బెడ్ రూంకి రమ్మన్నారట | Maryan heroine shocking comments.

Parvathy menon about casting couch

Parvathy Menon, Parvathy Menon Casting Couch, Actress Parvathy Menon, Bangalore Days Actress Sexual Harassment, Casting Couch Comments, Parvathy Menon Sexual Favours

Actress Parvathy Menon Comments on casting couch. Says star heroes and makers approached her for sexual favours.

హీరోయిన్లపై లైంగిక వేధింపులు నిజమే-పార్వతి

Posted: 04/03/2017 11:34 AM IST
Parvathy menon about casting couch

సినిమాల్లో అవకాశాల కావాలన్న, ఇండస్ట్రీలో ఎదగాలన్న పడక గదికి వెళ్లాల్సిందేనంటూ చెప్పుకొస్తున్న భామల లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు మరో మళయాళీ హీరోయిన్ కూడా సేమ్ వ్యాఖ్యలు చేసింది. పలువురు హీరోలు, దర్శకులు నన్ను అప్రోచ్ అయ్యారంటూ పెద్ద బాంబ్ పేల్చింది పార్వతి మీనన్. బెంగళూర్ డేస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతోపాటు ధనుష్ తో మరియన్, బెంగళూర్ నాట్కల్ లాంటి చిత్రాల్లో నటించి యూత్ లో మాంచి ఫాలోయింగే సంపాదించుకుంది ఈ బ్యూటీ.

గతంలో తాను చిన్న వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని చెప్పిన పార్వతి, రీసెంట్ గా ఓ చానల్‌కు ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్న ఆమె, పడకగదికి రమ్మనే చేదు అనుభవాన్ని తానూ ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా ఇక్కడ ఇదంతా కామనేనని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారని పేర్కొంది.

నిజానికి తాను తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఇదేనని, అలాంటి అవకాశాలు వద్దనే పెద్ద పెద్ద సినిమాల్లోంచి తప్పుకున్నట్లు చెప్పింది. ‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన పార్వతి చేసింది తక్కువ సినిమాలే అయినా మాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనుష్ తో మరియన్ లో ఆమె కనబరిచిన నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parvathy Menon  Casting Couch Comments  

Other Articles