హాలీవుడ్ కు విజయ్.. రాజకీయాల్లోకి అజిత్ ?? నిజమేనా? | Vijay Hollywood and Ajith Politics.

Vijay and ajith in hollywood director film

Director Raj Thiruselvan, Ajith Vijay Hollywood Director, Ajith Political Thriller, Vijay Hollywood Debut, Ajith Vijay Same Director, Ilayathalapathy Hollywood, Thala Hollywood Director

Hollywood film maker, Raj Thiruselvan has announced his interest to direct films with Vijay and Ajith. This Lake of Fire director has Ajith in mind for the political flick, while the latter, an all-in-all Hollywood film, will feature Vijay. Raj says he has talked to the actors, and believes to kick-start his films soon.

హాలీవుడ్ దర్శకుడితో విజయ్, అజిత్ సినిమాలు

Posted: 03/18/2017 10:07 AM IST
Vijay and ajith in hollywood director film

కోలీవుడ్ లో రజనీ-కమల్ తర్వాత విజయ్-అజిత్ ల సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. ఈ ఇద్దరు బాగానే ఉంటున్నప్పటికీ, అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో రెచ్చిపోతుంటారు. ఈ యేడాది వివేగమ్, విజయ్ 61వ చిత్రాలతో రాబోతుండగా, కత్తులు దూసుకునేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు. అయితే కారణాలేంటో తెలీదుగానీ గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే దర్శకుడితో సినిమాలు చేసిన దాఖలాలు లేవు. ఈ దశలో ఓ హాట్ న్యూస్ అక్కడ చక్కర్లు కొడుతోంది.

హాలీవుడ్ దర్శకుడు రాజ్ తిరుసెల్వన్ ఈ ఇద్దరితో సినిమాలను అనౌన్స్ చేసి మిగతా స్టార్ దర్శకులకు పెద్ద షాకే ఇచ్చాడు. ఎన్నారై అయిన తిరుసెల్వన్ లేక్ ఆఫ్ ఫైర్ అనే ఓ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాడు. ఇదయదళపతి, తలను దృష్టిలో పెట్టుకుని ఓ రెండు యూనిక్ కాన్సెప్ట్ లు తన మైండ్ లో ఉన్నాయని తెలిపాడు. అజిత్ కోసం పొలిటికల్ కథను, విజయ్ కోసం హాలీవుడ్ తరహా స్టోరీని సిద్ధం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు మరి అతగాడికి ఓకే చెప్పారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అల్రెడీ ఆ స్టార్ హీరోలతో స్టోరీ డిస్కషన్లు చేసిన అతను త్వరలో షూటింగ్ లు ప్రారంభం అవుతాయని చెబుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో 61 వ చిత్రంలో నటిస్తుండగా, దళపతి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నిత్యామీనన్, కాజల్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు శివ దర్శకత్వంలో అజిత్ వివేగమ్(తెలుగులో వివేకం) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hollywood Director  Raj Thiruselvan  Ajith  Vijay  

Other Articles