భర్త మరణంపై జయసుధ ఏమంటోంది? | Jayasudha on Husband's Suicide.

Jayasudha pleads media for privacy

Actress Jayasudha, Jayasudha Husband Death, Jayasudha's Husband Suicide, Jayasudha Husbands Last Rites, Nitin Kapoor Condolence Meet, Jayasudha Request Media, Jayasudha Silent on Husband Death

Actress Jayasudha request to media on Husband Death. After the last rites in Mumbai, a condolence meet will be held in Hyderabad.

మీడియాకు జయసుధ రిక్వెస్ట్

Posted: 03/16/2017 01:07 PM IST
Jayasudha pleads media for privacy

టాలీవుడ్ లో విషాదం నింపిన జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య ఉదంతంపై మీడియా లో రకరకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని, దయచేసి ఇందులో మీడియా కలుగజేసుకోవద్దంటూ ఆమె విజ్నప్తి చేస్తోంది సహజనటి. మరోవైపు నటుడు మోహన్ బాబు కూడా తన సోదరి జయసుధ భర్త విషయంలో లేనిపోని కథనాలు రాయకండి కోరిన విషయం తెలిసిందే.

తొలుత నితిన్ కపూర్ దేహాన్ని హైదరాబాద్ కు తీసుకువస్తారనే టాక్ వినిపించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ కపూర్ అంత్యక్రియలు ముంబై లోనే జరిగినట్లు తెలుస్తోంది. కొంత మంది కుటుంబ సభ్యుల మధ్యే మీడియా కవరేజ్ లేకుండా కానిచ్చేశారంట. హైదరాబాద్ లో ఓ సంస్మరణ సభను నిర్వహించాలనే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నితిన్ కపూర్ మరణంపై ఆయన కజిన్, వెటరన్ నటుడు అయిన జితేంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. నితిన్ తనను చాలా కాలంగా దూరం పెట్టాడని ఆయన అంటున్నాడు. డిప్రెషన్ లో గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేని నిర్మాత నితిన్ కపూర్ ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ ఆరో అంతస్థు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Jayasudha  Husband Nitin kapoor  

Other Articles

Today on Telugu Wishesh