మాధవన్ ను ఫైనాన్షియల్ గా ముంచిందెవరు? | Who behind Madhavan's Financial troubles.

Madhavan fate changed after irudhi sutru

Hero Madhavan, Madhavan Financial Trouble, Hero Financial Troubles, Madhavan Fate, Irudhi Sutru Madhvan Loss, Madhavan Upcoming Movies, Madhavan Seven Movies, Madhavan 2017 Movies, Madhavan Vikram Vedha Interview

Hero Madhavan Finally out of Financial Trouble, Seven Films in Hand. Seven films in hand suggest that his financial troubles had been addressed and audiences are going to watch Madhavan performing variety.

మాధవన్ ఫేట్ ఎంతగా మారిందంటే...

Posted: 03/16/2017 12:38 PM IST
Madhavan fate changed after irudhi sutru

ఒకప్పుడు యూత్ లో మంచి క్రేజ్ తోపాటు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆ హీరో తర్వాత రాంగ్ సబ్జెక్టులు ఎంచుకుని వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూశాడు. అది చాలదన్నట్లు ఏజ్ కూడా పై బడటంతో అవకాశాలు సన్నగిల్లిపోయాయి. దీంతో ఉన్న డబ్బంతా పెట్టి ఓ సినిమా తీశాడు. అది కమర్షియల్ సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే అతనికి ఆర్థిక కష్టాలు మాత్రం తప్పలేదు. కానీ, మళ్లీ ఇప్పుడు వరస సినిమాలు ఈ 46 ఏళ్ల హీరో కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టింది. ఇదంతా కోలీవుడ్ హీరో మాధవన్ గురించి...

ఇరుది సుట్రు ( హిందీలో సాలా ఖడ్డూస్) తో మాధవన్ ఫేట్ మొత్తం మారిపోయింది. గత నాలుగైదేళ్లుగా అరకోర సినిమాలతో, ప్రాధాన్యం లేని పాత్రల్లో అప్పుడప్పుడు కనిపించిన ఇతగాడికి ఈ సినిమా ఎంత బూస్ట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ పైబడిన కోచ్ పాత్రలో మాధవన్ ఫెర్ ఫార్మెన్స్ ఆకట్టుకోవటమే కాదు, వరుసగా మళ్లీ రెండు భాషల్లో అతన్ని బిజీ చేసేశాయి కూడా. అయితే సినిమా తనకు చేసిన నష్టం నుంచి కోలుకోవటానికి కాస్త టైం పట్టిందని చెబుతున్నాడు.

అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేతిలో ఉండటంతో మళ్లీ తాను హ్యాపీగా ఉన్నానంటూ, సమస్యలన్నీ తీరిపోయాయని చెబుతున్నాడు. ప్రస్తుతం మాధవన్ ఏడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి తో కలిసి నటిస్తున్న విక్రమ్ వేద లాంటి క్రేజీ ప్రాజెక్టు ఉంది. మొత్తానికి మరో రెండేళ్లపాటు కాల్షీట్ ఖాళీగా లేకుండా చేసుకోవటంతోపాటు, తనకున్న ఫైనాన్స్ ఇష్యూలను సాల్వ్ చేసుకున్నాడు ఈ సఖి హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Irudhi Sutru  Loss  Madhavan  Financial Troubles  

Other Articles