దీపిక రొమాంటిక్ లైఫ్ గాడి తప్పిందా? ఈ ఫోటో అర్థమేంటి? | Deepika chose ex Ranbir over current boyfriend Ranveer.

Deepika holi message confirm break up

Deepika Padukone, Ranveer Singh, Deepika Break Up, Ranveer Singh Break Up, Deepika Ranveer Singh Break Up, Deepika Holi Post, Deepika Ranbir Holi, Balam Pichkari Instead of Lahoo Munh Lag, Deepika Hint Break Up

Deepika Padukone Instagram post wishing her fans a happy Holi has confirm break up. She chose a picture of her and ex boyfriend Ranbir Kapoor from the song Balam Pichkari, leaving fans wondering why she did not opt for her Holi song with Ranveer, Lahoo Munh Lag Gaya.

బ్రేకప్ గురించి దీపిక తెలివిగా చెప్పేసిందా?

Posted: 03/15/2017 05:59 PM IST
Deepika holi message confirm break up

వాళ్ల రిలేషన్ బ్రేక్ అయ్యిందని ఎప్పటికప్పుడు మీడియా కోడై కూసినప్పుడల్లా తమ బాండ్ ఇంకా గట్టిదంటూ క్లోజ్ నెస్ ను మరీ ఎక్కువగా చూపించే వాళ్లు రణ్ వీర్ సింగ్-దీపికా పదుకునే జంట. అయితే ఈ మధ్య ఆ రూమర్లు ఎక్కువైనప్పటికీ, ఎందుకనో ఆ విషయంలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో ఈ క్రేజీ లవర్స్ మధ్య నిజంగానే విభేదాలు వచ్చాయా? అంటూ డిస్కషన్లు షురూ అయ్యాయి.

అయితే మొన్న హోలీ సందర్భంగా దీపికా పెట్టిన ఓ పోస్ట్ ఆ అనుమానాలను బలపరుస్తోంది. అభిమానులకు విషెష్ చెబుతూ 'యే జవానీ హై దివానీ' సినిమాలో  బాలం పిచ్చికారీ పాట హోలీ సంబంధించిన ఓ ఫోటోను దీపికా షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో రణ్ వీర్-దీపిక ప్రేమాయణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ రూమర్లు నిజం కాకపోతే 'రామ్ లీలా' సినిమాలో లహూ మున్హ్ హోలీ పాట సందర్భంగా తీసిన ఫోటోను పోస్టు చేసి ఉండేది కదా? అన్న ప్రశ్నను లెవనెత్తున్నారు.

దీపిక హాలీవుడ్ డెబ్యూ 'ట్రిపులెక్స్' సమయంలో హీరో విన్ డీజిల్ తో కలిసి సినిమా కంటే బయటే ఎక్కువ సన్నిహితంగా ఉండటం, అది ఇష్టం లేని రణ్ వీర్ ఆమెతో బ్రేకప్ అయ్యాడనేది బాలీవుడ్ లో ఓ గుసగుస. మరి ఇప్పుడు రణ్ బీర్ తో ఫోటో పెట్టి రణ్ వీర్ తో తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పడిందని తెలివిగా హింట్ ఇచ్చిందా? అన్నదే అసలు పాయింట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Ranveer Singh  Ranbir Kapoor  Holi Post  Break Up  

Other Articles