ఈ యంగ్ టాలెంట్ చేసిన పాపం ఏంటి? | Fatwa against Nahid Afrin for publicly singing.

Nahid afrin fights back on issuing fatwa

Nahid Afrin, Indian Idol Junior singer Nahid Afrin, Nahid Afrin Threat, Nahid Afrin Video, Nahid Afrin Fatwa, Nahid Afrin Clerics Fatwa, Assam CM Nahid Afrin

Indian Idol Junior singer Nahid Afrin fights back. Fatwa issued against Nahid. Not afraid, will sing till my last breath, says 16-yr-old Singer.

ఫత్వాలను పట్టించుకోను.. పాడటం ఆపను: నహీద్

Posted: 03/15/2017 06:11 PM IST
Nahid afrin fights back on issuing fatwa

తమ ఆదేశాలను ఉల్లంఘించినందుకు యువ గాయని నహీద్ అఫ్రిన్ పై ముస్లిం మత గురువులు కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పబ్లిక్ లో పాటలు పాడవద్దంటూ ఏకంగా 42 మంది మత గురువులు ఒకేసారి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వాను జారీ చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

2015 లో ఓ మ్యూజిక్ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అసోం యంగ్ టాలెంట్ తర్వాత తక్కువ టైంలోనే పాపులర్ అయిపోయింది. ఇండియన్ ఐడల్ జూనియర్ లో రన్నరప్ గా నిలిచింది. గతేడాది సోనాక్షి సిన్హా నటించిన అకీరా లో డెబ్యూ పాట కూడా పాడి ఆకట్టుకుంది. అయితే ఇలా పాటలు పాడటం మతాన్ని కించపరిచినట్లేనని పేర్కొంటూ మత పెద్దలు ఫత్వా జారీ చేశారు. మరోవైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఐసిస్ దుశ్చర్యలను ఖండిస్తూ కొన్ని ఆల్బమ్ లను నహీద్ పాడింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఫత్వాలను తాను ఏమాత్రం పట్టించుకోనని... పాటలు పాడటం నుంచి తనను ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేస్తూ ఓ భజన వీడియోను మళ్లీ అప్ లోడ్ చేసింది. దేశం మొత్తం తనను వెన్నంటి ఉందని తెలిపింది. మరోవైపు ఆమె రక్షణకు అసోం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎంతో ప్రతిభ గల నహీద్ పై ముస్లిం మత పెద్దలు ఆంక్షలు విధించడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వైష్ణవి సన్యాసి శ్రీమంత సంకరదేవ ఆల్బమ్ ద్వారా అసోం లో ఆమెకు పెద్ద ఎత్తున్న ఫాలోయింగ్ ఏర్పడింది కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer Nahid Afrin  Fatwa  Threat  

Other Articles

Today on Telugu Wishesh