ట్రైలర్ రిలీజ్ కు ముందు నిర్మాత సంచలన వ్యాఖ్యలు | Shobhu Yarlagadda is nervous ahead of the Baahubali 2 trailer launch.

Baahubali 2 trailer get ready

Baahubali 2 Trailer, Baahubali The Conclusion Trailer, Baahubali 2 Trailer Timing, Baahubali 2 Trailer Censor, Baahubali 2 Trailer Theaters List, Baahubali 2 Trailer Review, Baahubali Conclusion Trailer

Baahubali 2 Trailer Prabhas and Rana Daggubati the 2 Minutes trailer will open in 300 Screens.

బాహుబలి-2 ట్రైలర్ అంతా సిద్ధం

Posted: 03/15/2017 04:17 PM IST
Baahubali 2 trailer get ready

అవును మరి సినిమాపై ఉన్న అంచనాలకు నిర్మాతలకు ఆ మాత్రం టెన్షన్ ఉండటం సహజమే. బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ గురువారం ఉదయం థియేటర్ లలో రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన సుమారు 200 థియేటర్లలో, ఓవరాల్ గా మొత్తం 300 థియేటర్లలో బాహుబలి-2 ట్రైలర్ సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని వెల్లడించిన నిర్మాత శోభు యార్లగడ్డ తానెంతో నెర్వస్ గా ఉన్నట్లు వెల్లడించాడు కూడా. అయినా ట్రైలర్ అందరికీ నచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు కూడా.

 

మొదటి పార్ట్ కు చేసినట్లే హాలీవుడ్ తరహాలో సుమారు 2 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ను సర్వం సిద్ధం చేసేశాడు జక్కన్న. సెన్సార్ యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వగా, విజువల్ గ్రాండ్ గా ఉండబోతుందని ఇప్పటికే సంకేతాలు అందించారు కూడా. మొన్న రిలీజ్ చేసిన కేవలం మూడు సెకన్ల టీజర్ కే అదిరిపోయే రెస్పాన్స్ రాగా, ఇప్పుడు ట్రైలర్ ఇంకా ఎంత రచ్చ చేయబోతుందోనని అంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. 
ముంబైలో ఘనంగా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేసుకుంటుండగా, యూ ట్యూబ్ లో మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

ఆల్ మోస్ట్ వర్క్ అంతా పూర్తి కావటంతో ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి, వచ్చే నెల 28న బాహుబలి-2 అంతే భారీగా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 650 కోట్లు కొల్లగొట్టి దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా(ఫస్ట్ ప్లేస్ లో పీకే) రికార్డు సాధించగా, రెండో పార్ట్ పై వెయ్యి కోట్ల టార్గెట్ ఫిక్సయి ఉంది. బాహుబలి-2 కౌంట్ డౌన్ క్లాక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2 Trailer  Release Date  Theaters  

Other Articles