పద్మావతిపై మళ్లీ దాడి... కొట్టలేదు ఏకంగా కాల్చేశారు | Sanjay Leela Bhansali's Padmavati set torched in Kolhapur.

Padmavati set in kolhapur lit up with petrol bombs

Padmavati Set Fire, Padmavati Attack, Padmavati Kolhapur Attack, Padmavati Maharashtra, Bhansali Padmavati Attack, Sanjay Leela Bhansali's Padmavati, Padmavati Set Torch, Kolhapur Padmavati Set

Sanjay Leela Bhansali's Padmavati set put on fire near Kolhapur, team to lodge a complaint, confirms Bhansali Productions CEO.

పెట్రోల్ బాంబ్స్ తో పద్మావతి సెట్ పై దాడి

Posted: 03/15/2017 01:49 PM IST
Padmavati set in kolhapur lit up with petrol bombs

సంజయ్ లీలా బన్సాలీ పద్మావతి పై మరోసారి దాడి చోటుచేసుకుంది. సినిమాలో ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా చరిత్రను బన్సాలీ వక్రీకరిస్తున్నాడని ఇదివరకే ఓసారి జైపూర్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా దర్శకుడు బన్సాలీపై భౌతిక దాడి కూడా చోటుచేసుకుంది. దీంతో షూటింగ్ ను కొంత కాలం నిలిపివేశారు.

కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో తిరిగి షూటింగ్ ప్రారంభించగా, మంగళవారం రాత్రి సెట్స్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సుమారు 20 మంది అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దాడికి పాల్పడినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కలగలేదని సమాచారం. అక్కడే ఉన్న కార్లపై రాళ్ల దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది.

జైపూర్ దాడి తర్వాత సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని హామీ ఇవ్వాలంటూ కర్ణి సేన అనే ఓ గ్రూప్ డిమాండ్ చేయగా, అసలు సినిమాలో అలాంటి సన్నివేశాలేం లేవని బన్సాలీ వాదిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు సినిమా కోసం వేసిన పద్మిని ప్యాలెస్, చిత్తోర్ ఘడ్ సెట్స్ ను కూడా గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేయగా, తాజా దాడితో లక్షల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా.

రతన్ సింగ్ గా షాహిద్ కపూర్, రాణి పద్మినిగా దీపిక పదుకునే, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. పరిస్థితి ఇప్పుడే ఇలాగుంటే.. పద్మిని-ఖిల్జీల మధ్య గనుక రొమాన్స్ ఉన్నట్లు చూపిస్తే గనుక బద్ధలయిపోవటం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padmavati Set  Petrol Bomb Attack  

Other Articles

Today on Telugu Wishesh