ముంబైలో అద్దె అపార్ట్ మెంట్ లలోనే ఉండటం వెనుక సీక్రెట్ | Why Rana prefers rented apartments in Mumbai.

Rana not interested to buy a home in mumbai

Rana Daggubati, Rana Mumbai, Rana Rented Flats, Rana Bandra, Rana Daggubati Mumbai, Rana Mumbai, Rana Chennai house, Rana Mumbai Shooting, Rana Daggubati Bollywood

Rana Daggubati will never buy a house in Mumbai. He won’t buy a house in the city, “I have always rented apartments in Mumbai as they are too expensive to buy. I have never shifted to Mumbai completely. I live in Hyderabad. I have a place there as I’m there very often. In Mumbai I have to stay in an apartment as I am not too fond of hotels.

రానా చచ్చినా ఆ పని చేయడంట!

Posted: 03/15/2017 11:28 AM IST
Rana not interested to buy a home in mumbai

కెరీర్ మొదట్లో ప్చ్.. అబ్బే... అనిపించిన రానా తర్వాత క్రిటిక్స్ నోళ్లను మూయిస్తూ ఎంతో ఎదిగిపోయాడు. బాలీవుడ్; టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఇలా దగ్గుబాటి వారసుడి హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బాహుబలి మనోడికి తెచ్చిన పేరును సార్థకం చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. అయితే కెరీర్ మొదట్లో చేసినట్లుగా తనకు సూట్ కానీ సబ్జెక్ట్ ల జోలికి పోకుండా డిఫరెంట్ సబ్జెక్ట్ లనే ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు.

అయితే మూడు భాషల్లో చేస్తున్న రానాకు ఓ కొత్త సమస్య మాత్రం వచ్చి పడుతుందంట. అదే ఇంటి సమస్య. పుట్టి పెరిగిన ఊరు కావటంతో చెన్నై ఇతగాడికి కొత్తేం కాదు. అల్రెడీ అక్కడ దగ్గుబాటి వాళ్లకు ఓ ఇళ్లు ఉంది. ఇక హైదరాబాద్ సంగతి సరే సరి. మిగిలింది ముంబై మరి అక్కడ షూటింగ్ ల సమయంలో ఎక్కడ ఉంటాడని అడిగితే ఏం చెబుతున్నాడో తెలుసా?

షూటింగ్ సమయంలో హోటళ్లలో ఉండటం కంటే తాను ఓ అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకుని ఉండటమే సేఫ్ అని భావిస్తాడంట. అయితే ఆ సమయంలో ఫుడ్ మాత్రం తనకు చాలా ఇబ్బంది అవుతుందని చెబుతున్నాడు. ప్రస్తుతం బాంద్రాలో ఓ ఫ్లాట్ లో ఉంటున్నాడంట. అసలీ బాధలెందుకు ఎలాగూ నేషనల్ స్టార్ అయిపోయావ్ కదా? మిగతా స్టార్ హీరోల్లా ఎంచక్కా కొత్తది కొనుకోవచ్చు కదయ్యా అంటే.. వామ్మో! ముంబైలో ఫ్లాట్ లు చాలా కాస్ట్ లీ, నాలాంటి వాళ్లకు వాచీపోతుంది అంటూ ఎటకారంగా ఓ ఆన్సర్ ఇచ్చాడు. అయితే అద్దె కొంపకు ప్రాధాన్యం ఇవ్వటం వెనుక వేరే రీజన్ ఏదైనా ఉందా? అని లొసుగులు వెతికే పనిలో పడ్డారు ఇప్పుడు కొందరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Mumbai  Rented Apartments  

Other Articles

Today on Telugu Wishesh