పవన్ చనిపోయి ఉంటే బాగుండేదేమో: రేణు | Johny hit If Pawan dies in Climax.

Renu desai about johny disaster

Pawan Kalyan Johny Movie, Johny Disaster, Renu Desai Johny Movie, Johny Remake, Renu Desai Johny Failure, Renu Desai on Pawan Disaster, Pawan Ex Wife Interview, Renu Desai Power Star Disaster

Renu Desai Revealed Reasons Behind Johny Movie became Disaster. She explained that both she and Pawan had developed the story and script in a very nice way such that the movie should sure be hit if at all the movie was taken as per the story. But due to pressure from makers, some commercial elements were added into the film such as the death of hero changed as fans can’t digest.

జానీ డిజాస్టర్ ఎందుకు అయ్యిందంటే...

Posted: 03/14/2017 06:27 PM IST
Renu desai about johny disaster

పవన్ మాజీ భార్య తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అందులో పవర్ స్టార్ గురించి ఇప్పటిదాకా తెలియని ఆసక్తికర విషయాలనే వెల్లడించింది కూడా. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన జానీ సినిమా గురించి రేణూ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

2003 లో వచ్చిన ఈ చిత్రానికి పవనే దర్శకుడు కాగా, రేణూ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణమేంటో ఆమె చెబుతోంది. ఒరిజినల్ కథ ప్రకారం సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవాలంట. కానీ, కమర్షియల్ హంగుల కోసం కథను మార్చేశారని రేణు తెలిపింది. అంతేకాదు కథలో చాలా మార్పులు చేశారని కూడా చెప్పింది.

ఒకవేళ ఒరిజినల్ కథతో సినిమాను నిర్మించి ఉంటే... హిట్ అయి ఉండేదని ఆమె చెబుతోంది. అందుకే భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఆ ఒరిజినల్ కథతో 'జానీ' సినిమాను రీమేక్ చేస్తానని రేణు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai Interview  Pawan kalyan  Johny Flop  Remake Plan  

Other Articles

Today on Telugu Wishesh