హరీష్ కెలుకున్నాడు కాబట్టే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందంట! గొడవ గురించి ఛోటా ఏమంటున్నాడంటే... | Chota K Naidu bad experience with Harish Shankar. Read more at: https://www.mirchi9.com/movienews/director-chota-k-naidu-serious-allegation-director-harish-shankar/

Serious allegation on director harish shankar

Harish Shankar, Chota K Naidu, Director Harish Shankar, Cinematographer Chota K Naidu, Chota K Naidu Ramayya Vastavayya Disaster, Chota K Naidu Harish Shankar

Tollywood Senior Camera man Chota K Naidu comments on Director Harish Shankar.

హరీష్ శంకర్ పై ఛోటా కే నాయుడు కామెంట్లు

Posted: 03/14/2017 05:49 PM IST
Serious allegation on director harish shankar

టాలీవుడ్ లో ముక్కుసూటి తనానికి మారు పేరుగా సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడికి ఓ మార్క్ ఉంది. చిత్రంలో పని చేసే యూనిట్ సభ్యులపై సెటైర్లు వేయటం దగ్గరి నుంచి హీరోయిన్లపై కామెంట్లు చేయటం అంతా ఓపెన్ గానే ఆయన వ్యవహారం ఉంటుంది. అదే టైంలో పలు ఇంటర్వ్యూలలో కాంట్రవర్సీ విషయాల ప్రస్తావన తేవటం కూడా ఆయనకు అలవాటే. లెటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ తో విభేధాల గురించి చర్చించాడు కూడా.

వీరిద్దరు ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య సినిమా కోసం పని చేశారు. ఆ సమయంలో తన అనుభవాన్ని పక్కన పెట్టి దర్శకుడు ఏం చెబితే అది వినాల్సి వచ్చిందని, ఫలితంగానే సినిమా డిజాస్టర్ అయ్యిందని ఛోటా తెలిపాడు. తనకు సంబంధం లేని కెమెరా డిపార్ట్ మెంట్ లో తరచూ జోక్యం కల్పించుకోవటం మూలంగానే సినిమా విజువల్ క్వాలిటీ పరంగా ఘోరంగా దెబ్బతిందని చెప్పాడు ఛోటా. వర్క్ ఫరంగా ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే తమ పని సులువుగా ఉంటుందని, కానీ, హరీష్ ఆ విషయంలో మాత్రం ఫేలయ్యాడని చెప్పుకొచ్చాడు.

ఇక హీరోల్లో చిరు, ఎన్టీఆర్ లకు టెక్నికల్ గా పని చేయటానికి ఇష్టంగా ఉంటుందన్న ఆయన, వారిద్దరిని డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించటం తనకు ఎంతో నచ్చుతుందని తెలిపాడు. జూనియర్ ఏక సంథా గ్రాహి యే కాదని, సెట్ లో తెగ అల్లరి చేస్తాడని చెప్పుకొచ్చాడు. సీనియర్ లలో దాసరి, ఇప్పుడున్న వాళ్లలో వినాయక్, వంశీ పైడిపల్లిలు కెమెరా మెన్ లకు స్వేచ్ఛనిచ్చి తమకు కావాల్సిన అవుట్ ఫుట్ లను సరిగ్గా రాబట్టుకుంటారని కితాబిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Harish Shankar  Chota K Naidu  Ramayya Vastavayya Flop  

Other Articles