పవన్ భర్తగా యావరేజ్.. పెళ్లి తొందరపాటు నిర్ణయమేనా? | Renu Desai Comments on Pawan's Personal life.

Pawan kalyan ex wife surfaces in media again

Power Star Pawan kalyan, Pawan Kalyan Renu Desai, Renu Desai Interview, Pawan kalyan Ex Wife, Renu Desai Impulsive Decision, Pawan Kalyan Average Student, Pawan Kalyan as Husband, Renu Desai Women’s Day Interview

Power Star Pawan kalyan Ex Wife Renu Desai again surface on media. On the eve of Women’s Day she gave an interview. She said marrying Pawan Kalyan was an impulsive decision and As a husband, she gave average marks for him.

పవన్ భర్తగా ఓ యావరేజ్ స్టూడెంట్: రేణూ దేశాయ్

Posted: 03/06/2017 09:57 AM IST
Pawan kalyan ex wife surfaces in media again

పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్లే అవుతోంది. ఈ మధ్య కాలంలో చాలాసార్లు పవన్ గురించి ట్వీటుతూ మీడియాలో నానుతూ వస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇంటర్వ్యూలతో పలకరించిన పెద్దగా విషయాలేవీ చెప్పుకురాలేదు. అయితే ఈ మహిళా దినోత్సవంకు మాత్రం చాలా ఆసక్తికర విషయాలనే చెప్పుకొచ్చింది.

మహిళా దినోత్సవం నేపథ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్’లో భాగంగా పవన్ గురించి రేణూ పలు విషయాలు తెలిపింది. వ్యక్తిగా తాను చాలా ఇంపల్సివ్ అన్న రేణూ, చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నానని, పవన్ ను పెళ్లి చేసుకోవటం కూడా అలాంటిదే నని చెప్పుకు రావటం కాస్త షాక్ కలిగించింది. భర్తగా, తండ్రిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పది మార్కులకు పవన్ కల్యాణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు రేణూ స్పందిస్తూ.. భర్తగా పవన్ ‘యావరేజ్ స్టూడెంట్’ అని, పదికి నాలుగు లేదా ఐదు మార్కులు మాత్రమే ఇస్తానని, తండ్రిగా మాత్రం పదికి వంద మార్కులు, నటుడిగా, రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులు వేస్తానని రేణూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

భవిష్యత్ లో ఏం చేస్తాడో తెలీదు గానీ, ఆయన ఆలోచనలు మాత్రం బాగున్నాయని తెలిపింది. మొత్తానికి పవన్ గురించి రేణు చెప్పే విషయాలపై ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోగా ఇప్పుడీ ఇంటర్వ్యూతో కాస్త షాక్ తగిలినప్పటికీ పూర్తి ఇంటర్వ్యూ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai Interview  Women’s Day Special  Power Star  Pawan Kalyan  

Other Articles