రోబో రైట్స్ కథ నిజమేనా? రెండింటిలో ఏది ఎక్కువ? | 2.0 original satellite price.

Satellite rights of rajinikanth 2 0 record price

Enthiran 2 Rights, 2.0 Satellite Rights, Baahubali 2 Enthiran 2, Baahubali 2 Satellite Rights,

Enthiran 2 aka 2.0 satellite rights: Rajinikanth, Akshay Kumar's film to beat SS Rajamouli's Bahubali 2. Enthiran 2 Baahubali The Conclusion

2.0 శాటిలైట్ రైట్స్ బిజినెస్ నిజమేనా?

Posted: 03/14/2017 05:01 PM IST
Satellite rights of rajinikanth 2 0 record price

బాహుబలి సినిమా రికార్డులను పడగొట్టాలని తమిళ సినీ వర్గాలు కొంతకాలంగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య విజయ్ ‘పులి' అనే సినిమా తీసినా అది బాహుబలిని బీట్ చేయలేక పోయింది. తర్వాత ‘ఐ' సినిమా వచ్చింది. అదీ చతికిల పడింది. ఇపుడు బాహుబలిని పడగొట్టడమే లక్ష్యంగా శంకర్ 2.0 ను సిద్ధం చేస్తున్నాడు.

సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అదే స్థాయిలో కూడా బిజినెస్ అవసరం కదా. అందుకే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను 110 కోట్లకు అమ్మేశాడు. హిందీ, తెలుగు, తమిళ వర్షన్ లకు ఈ భారీ రేటుకు జీ నెట్ వర్క్ కొనుగోలు చేసింది. అయితే ఈ విషయంలో కూడా మళ్లీ బాహుబలిని బీట్ చేయలేకపోయింది రోబో 2.0.

బాహుబలి ది కంక్లూజన్ ఒక్క హిందీ శాటిలైట్ రైట్సే 51 కోట్లకు అమ్ముడు పోవటం(సోనీ ఎంటర్ టైన్ మెంట్) ఇక్కడ విశేషం. మూడు భాషల్లో కలిపి వందకోట్లు పైగానే అమ్ముడుపోగా, ఒకటి రెండు లాంగ్వేజ్ లు ఎక్కువగా ఉండటంతో ఆ లెక్కలు 120 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మొత్తానికి రెండింటి రిలీజ్ కు చాలా గ్యాప్ ఉండటంతో ఇప్పుడు ఎవరి పేరిట రికార్డులు పదిలంగా ఉంటాయన్నదానిపైనే అసలు చర్చ నడుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Enthiran 2  Satellite Rights  Record Price  

Other Articles