సల్మాన్ కొట్టింది ఐష్ ను కాదంట.. మరి? | Salman Khan never beat Aishwarya Rai.

Salman khan confess that he beat subash ghai

Salman Khan, Salman Beat Aishwarya Rai, Subhash Ghai Salman Khan Fight, Salman Aishwarya Relation, Salman Never Beat Aishwarya, Salman Khan Latest Interview

Bollywood Star Hero Salman Khan had revealed to a leading daily that he never hit Aishwarya Rai but he did slap Subhash Ghai once.

కొట్టింది ఆ దర్శకుడినే, ఐష్ ను కాదు: సల్మాన్

Posted: 03/14/2017 03:49 PM IST
Salman khan confess that he beat subash ghai

బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ వివాదాలతో న్యూస్ ల్లో నిలవటం కొత్తేం కాదు. ప్రోఫెషనల్ గా క్లీన్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ, పర్సనల్ లైఫ్ మాత్రం మొత్తం కాంట్రవర్సీలే. అయితే కోర్టు కేసుల గోల అటుంచి ఓ రెండు విషయాలు మాత్రం బాలీవుడ్ లో ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూనే ఉంటాయి. అదే ఒకటి ఐశ్వర్యరాయ్ పై చేయి చేసుకోవటం, రెండోది సీనియర్ దర్శకుడు సుభాష్ ఘోయ్ తో ఫైట్.

2002 లో సల్మాన్ తో యువరాజ్ సినిమా తీశాడు సుభాష్ ఘోయ్. ఆ సందర్భంగా ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ లో అసలు విషయాలు బయటపడ్డాయి. అందులో సల్మాన్ ఈ రెండు అంశాలపై ఎలా స్పందించాడో చాలా స్పష్టంగా ఉంది. అప్పట్లో ఐష్ సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. ఒకానోక దశలో వారిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. అయితే తానసలు ఐష్ పై ఎన్నడూ దాడి చేయలేదని సల్లూ భాయ్ వివరించాడు. నిజానికి నాకు కోపం ఎక్కువే. కానీ, ఎవరిని కొట్టిన దాఖలాలు లేవు. పైగా ఆ చిరాకులో నన్ను నేనే గోడను బాదుకుని గాయాలు చేసుకునే వాడినని వివరించాడు.

అయితే సుభాష్ ఘాయ్ తో మాత్రం తాను గొడవ పడిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చాడు. ఆయన నా పట్ల దారుణంగా వ్యవహరించాడు. నా షూలపై మూత్రం పోశాడు. అంతే కాదు నన్ను స్పూన్ తో కొట్టాడు. చేతిలో ఉన్న ప్లేటుని ముఖం పైకి విసిరాడు. మెడపట్టి నెట్టాడు కూడా. దీంతో సహనం కోల్పోయాను. కోపంతో ఆయన్ని కొట్టాల్సి వచ్చింది. అయితే తర్వాత తన తండ్రి సలీం ఖాన్ చెప్పటంతో సుభాష్ కి సారీ చెప్పాను’’ అని సల్మాన్ వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Salman Khan  Aishwarya Rai Slap  Subhash Ghai Hit  

Other Articles

Today on Telugu Wishesh