జబర్దస్త్ ‘ముక్కు’ అవినాష్ పై పోలీసు కేసు.. ఏం చేశాడో తెలుసా? | Case Filed On Jabardasth Avinash.

Police case files against jabardasth actor

Jabardasth Actor Mukku Avinash, Actor Avinash, Avinash Cheating Case, Avinash Police Case, Jabardasth Avinash, Mukku Avinash, Jabardasth Actor Police Case, Mukku Avinash Cheating Case, Jabardasth Actor, Police Case Jabardasth Actor, Jabardasth Avinash Arrest

A police case has been filed on Jabardasth Actor Mukku Avinash. As per the reports, this actor has promised to do a show on the occasion of Maha Shiva Rathri but he was not seen at the event, and he failed to keep his promise. The allegations are that Avinash has taken ten thousand rupees for the programme, but he never turned off at the event. The case has been filed on him by Venu Gopal Reddy at Jubilee Hills PS. The police registered the case.

జబర్దస్త్ అవినాష్ పై పోలీస్ కేసు

Posted: 03/02/2017 08:32 AM IST
Police case files against jabardasth actor

ప్రస్తుతం ఉన్న టెలివిజన్ షోలలో జబర్దస్త్ నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను పరిచయం చేస్తున్న ఈ షో అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు కూడా వేదిక అవుతుందన్నది తెలిసిందే. ఇక ఇప్పుడు ఇందులో నటిస్తూ నిత్యం కడుపుబ్బా నవ్వించే ఓ నటుడిపై పోలీస్ కేసు నమోదు కావటం విశేషం.

మాస్ అవినాష్ కెవ్వు కార్తీక్ టీం లీడర్, పలు సినిమాల్లో చిన్నా చితక పాత్రలు పోషించిన నటుడు అవినాష్(ముక్కు అవినాష్ గా పాపులర్) పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి కేటీ క్రియేషన్స్‌ పేరుతో ఈవెంట్స్‌ నిర్వహిస్తుంటాడు. మహాశివరాత్రి సందర్భంగా అవినాష్‌తో ఎంటర్ టైనింగ్ ప్రోగ్రాం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఈనెల 14నే రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు.

అయితే ఒప్పందం ప్రకారం అతను కార్యక్రమానికి హాజరుకాలేదు. పైగా తన సెల్‌ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారు అప్ సెట్ అయ్యారని, అంతేకాకుండా తమ ఈవెంట్‌ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని వేణుగోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అవినాష్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కూడా. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth  Mukku Avinash  Police Case  

Other Articles

Today on Telugu Wishesh