పూరీ రోగ్ ట్రైలర్: చంటిగాడి లవ్వేడుంది.. అంతా రొమాన్సే! | Puri Jagannadh Rogue trailer review.

Nothing new in puri rogue trailer

Director Puri Jagannadh, Puri Rogue, Rogue Movie Trailer, Rogue Trailer, Rogue Trailer Review, Rogue Heroines, Rogue Hero Isaan, Rogue Kannada Movie, Rogue Telugu Movie

Rogue is the new film from director Puri Jagannadh. Recently its Official trailer released not not impressed. Puri Shows his old elements in this movie.

పూరీ రోగ్ ట్రైలర్ రిలీజ్

Posted: 03/02/2017 09:42 AM IST
Nothing new in puri rogue trailer

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం రోగ్. కన్నడ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా నిషాన్ అనే కుర్రాడు పరిచయం అవుతున్నాడు. మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్లు.  రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా, పూరీ పాత సినిమాల్లాగే కనిపిస్తున్నప్పటికీ, ఫన్ ఎలిమెంట్ మాత్రం మిస్సయ్యినట్లు కనిపిస్తోంది.

మరో చంటిగాడి ప్రేమ కథ అంటూ ట్యాగ్ లైన్ తో వస్తున్న రోగ్ ఫస్ట్ లుక్ తో కాస్త ఆసక్తి పెంచింది. అయితే ట్రైలర్ రిలీజ్ మాత్రం తుస్సుమనిపించేసింది. ఒరిజినల్ చంటిగాడి ప్రేమకథలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ ను కూడా ఇందులో చూపించట్లేదని అర్థమౌతోంది. పూరీ సినిమాల్లోని లవ్, రొమాన్స్, యాక్షన్ లాంటి ఎలిమెంట్లు ఉన్నప్పటికీ అవి కాస్త ఎక్కువ అయ్యాయనే అనిపిస్తుంది.

 

కథలేకపోయినా కనీసం డైలాగ్ లతోనైనా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసే ఈ స్టార్ దర్శకుడు ఈసారికి అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోవటం కొసమెరుపు. పైగా ప్రేమ కథ అని చెబుతూ ఎరోటిక్ యాంగిల్స్ లోనే లీడ్ కపుల్ చూపించేశాడు. మరి ఈ వయొలెంట్ లవ్ కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ అయితే గానీ రిజల్ట్ ఏంటో తెలీని పరిస్థితి ఉంది. చూద్దాం.. టెంపర్ తర్వాత హిట్ లేని పూరీ ఈ రకంగానైనా ఆ లోటు పూడుస్తాడేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Rogue Trailer  

Other Articles