డీజే డిస్ లైక్స్.. కొత్త ట్విస్ట్ బ్రదర్ | Dislike button help to Allu Arjun.

Duvvada jagannadham teaser clocks 6 million views

Allu Arjun Dislike, Duvvada Jagannadham Teaser, DJ Teaser, 6 Million Mark, DJ Kahidi Katamarayudu Teaser, Tollywood Trending Teaser, DJ Movie, Duvvada Jagannadham Movie

Allu Arjun starer Duvvada Jagannadham teaser, which was out on Maha Sivaratri, has opened to terrific response from the Telugu circuit, clocking more than 6 million views in a week's time.

డీజే టీజర్ 6 మిలియన్ వ్యూవ్స్ రికార్డు

Posted: 03/01/2017 04:24 PM IST
Duvvada jagannadham teaser clocks 6 million views

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి రుజువయ్యింది. వరుస బ్లాక్ బస్టర్ లతో తాను టాప్ హీరో రేసులో ఉన్నానని నిరూపించుకున్న బన్నీ మరోసారి డీజే టీజర్ తో సత్తా చాటుకున్నాడు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ చిత్ర టీజర్ ఇప్పటిదాకా ఆరున్నర మిలియన్ల వ్యూవ్స్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది. మొదట్లో ఉత్త హైపే అన్న టాక్ వినిపించినప్పటికీ, ఆ తర్వాత కూడా స్డడీగా ఇది దూసుకుపోతుండటంతో విశేషం.

ఇంకోవైపు డిస్ లైక్ ల పేరుతో కొందరు చేసిన యత్నం బన్నీకి ఫ్లస్ గానే మారింది. అది చాలదన్నట్లు మోస్ట్ వరస్ట్ టీజర్ రికార్డును ఖాతాలో వేసకుందంటూ పనిగట్టుకుని ఆ బ్యాచ్ ప్రచారం చేసింది కూడా. దీని వెనుక కారకులు ఎవరన్న సంగతి పక్కన పెడితే కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా డీజే దూసుకుపోతుంది. 8 మిలియన్ వ్యూవ్స్ తో కాటమరాయుడు ఈ లిస్ట్ లో ఫస్ట్ ఫ్లేస్ లో ఉండగా, ఏడున్నర మిలియన్స్ తో ఖైదీ నంబర్ 150 సెకండ్ ఫ్లేస్ లో కొనసాగుతుంది. 47 ఏడు సెకన్లతో బన్నీ డీజే టీజర్ ఊపుతున్న తీరు చూస్తుంటే ఖైదీ ని క్రాస్ చేసి కాటమరాయుడు దగ్గరగా వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. అదే జరిగితే మాత్రం బన్నీ, టాలీవుడ్ లో ఇప్పుడున్న ఇద్దరు అగ్రహీరోల సరసన నిలిచాడన్నది మరోసారి స్పష్టం అవుతుంది.

పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దేవీ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ రెండో వారంలో దువ్వాడ జగన్నాథమ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. టీజర్ కోసం క్లిక్ చేయండి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Duvvada Jagannadham Teaser  Allu Arjun  Pooja Hegde  6 Millions Views  

Other Articles