మనోజ్ కి షాక్: వాయిస్ ఓవర్ అడిగితే చిరు అలా చేశాడంట | Chiranjeevi voice over for Manoj's Gunturodu Movie.

Story behind chiru s voice over to gunturodu movie

Gunturodu Movie, Megastar Voice Over, Chiranjeevi Voice Over, Gunturodu Movie Voice Over, Megastar Voice Manchu Hero, Manchu Manoj Gunturodu Interview, Manchu Manoj Chiranjeevi, Chiranjeeevi about Manchu Manoj, Manchu Manoj Chiru Voice, Manchu Manoj Ram Charan, Ram Charan Gunturodu Movie, Manchu Hero Mega Shock

Manchu Manoj reveals story how he get Chiranjeevi's Voice over to Gunturodu Movie.

మంచు హీరో మెగా బూస్టప్, ఎలా దొరికిందంటే...

Posted: 02/27/2017 02:58 PM IST
Story behind chiru s voice over to gunturodu movie

ప్రయోగాత్మక చిత్రాలు ఓవైపు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నప్పటికీ మంచువారబ్బాయి మనోజ్ మాత్రం వాటి విషయంలో కాంప్రమైజ్ కావటం లేదు. గుంటూరోడు అంటూ మరో మాస్ కంటెంట్ మూవీతో రాబోతున్నాడు. మార్చి 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్ అంతా ఇంతకు ముందు సినిమాలాగే రెగ్యులర్ కంటెంట్ లా అనిపిస్తోంది. అయితే ఈ సినిమాను అదనపు ఆకర్షణ ఏదైనా ఉందా? అంటే అది మెగాస్టార్ వాయిస్ ఓవరే అని చెప్పుకోవాలి.

ఓ మంచు ఫ్యామిలీ హీరో సినిమాకు ఏకంగా చిరుయే స్వయంగా గొంతు అరువు ఇవ్వటంతో అది కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీనివెనుక పెద్ద స్టోరీయే ఉందని చెబుతున్నాడు మనోజ్. నిజానికి ఈ సినిమాకు రాంచ‌ర‌ణ్‌ తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు ముందు ప్రయత్నించారంట మేకర్లు. ఈ విషయమై చెర్రీకి స్వయంగా మనోజే ఫోన్ చేసి అడిగాడంట.. అయితే ఆ సమయంలో చెర్రీ విదేశాల్లో ఉండటంతో మ‌రో ఆప్షన్ వెదుక్కోవాల్సివ‌చ్చింద‌ట‌.

ఓరోజు మోహ‌న్ బాబు ఫ్యామిలీ చిరు ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లిన సమయంలో మనోజ్ చిరుని రిక్వెస్ట్ చేశాడ‌ట మ‌నోజ్‌. ”చ‌ర‌ణ్ ఊర్లో లేడు. రావ‌డానికి టైమ్ ప‌డుతుంది. అందుకే మీతో చెప్పిద్దాం అనుకుంటున్నా అని అడిగా. వెంట‌నే ‘టైమ్ ఎంత ఉంది’ అని అడిగారు. ‘రెండ్రోజుల్లో చెప్పేయాలి..’ అన్నా. ‘రెండ్రోజులెందుకు.. ఈరోజే చెప్పేస్తా’ అన్నారు అంకుల్‌. నిజంగా… ఆయ‌న పెద్ద మ‌న‌సుకి థ్యాంక్స్‌’ అంటూ మనోజ్ తెలిపాడు.

చివరకు తనకు కూడా తెలీకుండానే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేసి, ఫోన్ చేసి మరీ ఓసారి చెక్ చేసుకో అని చెప్పాడంట. అంత స్పీడ్ గా అయిపోవటంతో ఒక్కసారిగా మనోజ్ కి షాక్ తిన్నట్లు అయ్యిందంట. ఇక చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాక చ‌ర‌ణ్‌ని ఫోన్ చేస్తే. ‘పిట్ట కోసం వెదికితే నీకు పులే దొరికింది’ అన్నాడంట. సినిమాలో చిరు వాయిస్ ఓవ‌ర్ క్యారెక్టరల్లను రివీల్ చేస్తూ... వస్తుందని, ఖచ్ఛితంగా సినిమాకు ఫ్లస్ పాయింట్ అవుతుందని అంటున్నాడు మనోజ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Gunturodu Movie  Chiranjeevi Voice Over  

Other Articles