కంగనాతో అలాంటి కామెంట్లు అస్సలు చేయలేదా? | SRK says he not comments against Kanagana.

Srk on acting with kangana

Shah Rukh Khan Kangana Ranaut, Baadshah with Queen, SRK Kangana Ranaut, Sanjay Leela Bansali New Movie, Kangana Ranaut Rumours, SRK T Subbirami Reddy

Bollywood Star Shah Rukh Khan denies turning down film with Kangana Ranaut.

కంగనాతో నాకేం సమస్య లేదు: షారూఖ్

Posted: 02/27/2017 01:46 PM IST
Srk on acting with kangana

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ మోకాలి శస్త్ర చికిత్స కావటంతో ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. సినిమాలేవీ సైన్ చేయని షారూఖ్ త్వరలోనే సంజయ్ లీలా బన్సాలీ కొత్త సినిమాలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా కోసం కంగనా రనౌత్ తీసుకునేందుకు దర్శకుడు బన్సాలీ యత్నించగా, అందుకు షారూఖ్ నో చెప్పాడన్న వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. క్వీన్ తియ్యని కోరిక ఏంటంటే...

స్టార్ హీరోలపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఆమెతో నటించేందుకు తాను సిద్ధంగా లేనని షారూఖ్ చెప్పుకోచ్చాడన్న ఓ వార్త తెగ వైరల్ అయ్యింది. దీనిపై బాద్ షా స్పందించాడు. మీడియాలో వచ్చే ఇలాంటి రూమర్లను దయచేసి నమ్మొద్దంటూ తెలిపాడు. తాను ఎవరితోనైనా నటించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ప్రకటించాడు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించే యశ్ చోప్రా జాతీయ స్మారక అవార్డును షారూఖ్ కు బహుకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన షారూఖ్ కంగనా కాంట్రవర్సీపై స్పందించాడు.

ప్రస్తుతం కొత్త సినిమాలపై క్లారిటీ ఇవ్వని షారూఖ్ యశ్ రాజ్ బ్యానర్ లో ఇత్తేఫాక్ రీమేక్ ను తన రెడ్ చిల్లీస్ సంస్థతో కలిసి షారూఖ్ నిర్మించబోతున్నాడు. నిజానికి తానే సినిమాలో నటించాల్సి ఉన్నప్పటికీ గాయం కారణంగా ఆ ఛాన్స్ మిస్సయినట్లు తెలిపాడు. సోనాక్షి సిన్హా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించనున్న ఇత్తేఫాఖ్ కు అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Kangana Ranaut  Sanjay Leela Bansali  

Other Articles