ఛాన్స్‌ కావాలంటే అది కావాలని...డైరక్ట్ గా అడిగాడు.. ఆ హీరోయిన్ ను కొత్తలో కోరిక తీర్చమన్నాడంట! | Regina about sexual favors in Industry.

Regina sexual harassment in her initial stage

Actress Regina Cassandra, Regina Cassandra, Regina Cassandra Sexual Favours, Regina Carrier, Regina Prefers Love Marriage, Regina Cassandra Love, Regina Cassandra Harassment

Regina Cassandra face sexual harassment in her starting carrier. Some asks for Sexual Favours for Chances. She Interested in Love marriage only.

కెరీర్ కొత్తలో రెజీనాకు లైంగిక వేధింపులు!

Posted: 02/27/2017 03:44 PM IST
Regina sexual harassment in her initial stage

పెద్దగా స్టార్ లతో సినిమాలు ఏం చేయలేదు. పైగా సక్సెస్ రేట్ అంతంత మాత్రమే. అయినా టాలెంట్ తో అవకాశాలు ఇంకా దక్కించుకుంటూనే ఉంటుంది డస్కీ రెజీనా కస్సాండ్రా. ప్రస్తుతం ఓ అరడజను చిత్రాలతోపాటు, తెలుగులో నక్షత్రం లాంటి క్రేజీ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్న భామ ఏకంగా అమితాబ్ ఆంఖే-2 లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కేవలం తన అదృష్టమే తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణమని చెబుతోందీ చెన్నై బ్యూటీ.

ఇక కెరీర్ తొలినాళ్లలో తన నుంచి కొందరు వేరే ఫేవర్ అశించారని చెబుతోందీ. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, రెజీనా మాట్లాడుతూ... గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గురించి చెప్పుకుంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం తాను ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు, ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళ సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పాడని, అయితే, చాన్స్ కావాలంటే, కొన్నింటికి అడ్జస్ట్ కావాల్సి ఉంటుందంటూ డొంక తిరుగుడు మాటలు మాట్లాడాడని, అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఫోన్ పెట్టేశానని అంది.

Regina About Sexual Favorismఆపై అతని ఉద్దేశ్యం అర్థమై ఫోన్ చేసి చెడా మడా వాయించేసినట్లు చెప్పుకొచ్చింది. ఇటువంటి పరిస్థితి చాలా మందికి ఎదురవుతూనే ఉంటుందని, విపత్కర పరిస్థితులు ఎదురైన వేళ, మహిళలకు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిసుండాలని సలహా ఇచ్చింది. ఇటీవల భావనపై దాడి సందర్భంగా స్టార్ హీరోల వారుసులం అయినప్పటికీ తాము ఇలాంటి వేధింపులు ఎదుర్కున్నామని మంచు లక్ష్మీ, వరలక్ష్మి శరత్ కుమార్, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ లు కామెంట్ చేయటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Regina Cassandra  Carrier  Love Marriage  Sexual Harassment  

Other Articles

Today on Telugu Wishesh