ఆ స్టైలిష్ హీరో ఇలా అయిపోయాడేంటి? | Jayam ravi as Tarzan in Vanamagan First Look.

Jayam ravi vanamagan first look released

Kollywood Movie, Vanamagan Movie, Vanamagan 2017, Vanamagan Jayam Ravi, Jayam Ravi New Movie, Jayam Ravi, Actress Sayyeshaa Saigal, AL Vijay, Jayam Ravi, Vanamagan First Look Teaser, Vanamagan First Look Teaser Release, Vanamagan Official Teaser, Vanamagan Teaser, Jayam Ravi Sayyeshaa Saigal, Sayyeshaa Saigal Vanamagan

Kollywood Movie Vanamagan First Look out and teaser date released. Jayam Ravi starring Vanamagan directed by AL Vijay. the teaser will be unveiled on Feb 6th. Sayyeshaa Saigal is doing the female lead in it. She had tweeted about the release date in her social media page.

జయం రవి ‘వనమగన్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 02/06/2017 09:59 AM IST
Jayam ravi vanamagan first look released

దేశంలో ఇప్పుడు అన్ని భాషల్లోని యువహీరోలంతా ప్రయోగాల బాటే పడుతున్నారు. సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా.. కేవలం కథను మాత్రమే నమ్ముకుని, అందుకు అనుగుణంగా తమను తాము మార్చేసుకుంటూ సక్సెస్ ల బాట పడుతున్నారు. కోలీవుడ్ లో కూడా జయం రవి ప్రస్తుతం ఓ ప్రయోగం చేయబోతున్నాడు. తనిఒరువన్ తర్వాత వరుసగా హిట్లతో ఫాంలో ఉన్న రవి త్వరలో మరో డిఫరెంట్ జోనర్ సినిమా తో రాబోతున్నాడు. అదే వనమగన్.

అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో జయం రవి ఓ టార్జన్ గెటప్ లో కనిపించబోతున్నాడు. అఖిల్ సినిమా హీరోయిన్ సయేషా సైగల్ హీరోయిన్ పాత్రలో, నటుడు వరుణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది కూడా. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న వనమగన్ కోసం బాడీని బాగా తగ్గించేసిన రవి, ఓ విల్లు ధరించి ఊడలను పట్టుకుని వేలాడుతున్న పోస్టర్ కి మంచి స్పందనే వస్తోంది.

ఇక ఈ చిత్ర టీజర్ ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. హ్యారిస్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్న వనమగన్ సమ్మర్ లో విడుదల కానుంది. మన్నెం వీరుడు పేరుతో తెలుగులోకి అనువాదం అయ్యే అవకాశం ఉంది.  కాగా, మరో యంగ్ హీరో ఆర్య కూడా దాదాపు ఇదే కాన్సెప్ట్ తో కదంబన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vanamagan  Official Teaser  2017  Jayam Ravi  AL Vijay  Sayyeshaa Saigal  

Other Articles