కాటమరాయుడి దుమ్మురేగిపోయే ఎంట్రెన్స్.. ఆపై సీన్ రివర్స్! | Katamarayudu Business increased after Teaser Released.

Pawan katamarayudu is in safe hands after teaser

Katamarayudu Business, Katamarayudu Teaser, Katamarayudu YouTube Records, Katamarayudu Youtube, Katamarayudu Pre Release Business, Katamarayudu Movie, Pawan Kalyan Katamarayudu, Katamarayudu Buyers, Katamarayudu Scene Reverse

Expectations reached peaks after Katamarayudu teaser released. Power Star Pawan Kalyan upcoming movie creates new record in Youtube. Katanarayudu Pre Release business also increased.

టీజర్ తో టోటల్ సీన్ రివర్స్ అయ్యింది

Posted: 02/06/2017 10:30 AM IST
Pawan katamarayudu is in safe hands after teaser

లేట్ చేయటం మూలానో ఏమో కాటమరాయుడు టీజర్ పై అది బయటికొచ్చే రెండు రోజుల ముందుదాకా అభిమానుల్లో సైతం పెద్దగా ఆశలు లేవు. ముఖ్యంగా రీమేక్ కావటం, పైగా ఇప్పటికే అది టీవీల్లో చాలాసార్లు అరిగిపోయేలా వేసి ఉండటంతో నాన్ ఫ్యాన్స్ కూడా లైట్ తీస్కున్నారు. అయితే ఏ నిమిషాన అది రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సినిమాపై అంచనాలు అమాంతం పెరిగే రీతిలో టీజర్ ను సరిగ్గా రూపొందించారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్న టీజర్ తో టోటల్ సీనే మారిపోయింది.  టీజర్ కోసం క్లిక్ చేయండి

ఒక్క రోజులో 3 మిలియన్లతో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందంటే అందుకు పవన్ క్రేజే కారణం. ఇంతకు సర్దార్ గబ్బర్ సింగ్ లాస్ నేపథ్యంలో కాటమరాయుడిపై బేరాలాడిన వాళ్లే కూడా ఇప్పుటు ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేస్తూ నిర్మాత శరత్ మరార్ వెనక తిరుగుతున్నారంట. కొన్ని ఏరియాల్లో ఖైదీ నంబర్ 150, బాహుబలిని మించి బిజినెస్ జరిగిపోతోంది. ఇదంతా కేవలం 30 సెకన్ల టీజర్ లో పవన్ చూపించిన మాస్ మసాలా యాక్షన్ కంటెంట్ మహిమనేని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

30 సెకన్లతోనే సెన్సేషన్స్ సృష్టిస్తున్న పవన్ మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పటం ఖాయమనే అనుకోవచ్చు. మొత్తానికి పెద్ద బ్యాంగ్ తోనే ప్రచారం ప్రారంభించిన కాటమరాయుడు పవన్ క్రేజ్ ను మరింత పెంచటమే కాదు , భారీ బిజినెస్ చేస్తుందా అన్న అనుమానాలను పటా ఫంచల్ చేసేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan  Teaser  YouTube Records  Pre Release Business  

Other Articles