అజిత్; విజయ్, సూర్య, విక్రమ్ లకు ఊహించని షాక్.. ఎందుకిలా జరిగింది? | Top Kollywood Heroes not Placed in Times list.

Chennai times most desirable men ignored top heroes

Ajith Vijay Suriya and Vikram, Chennai Times Most Desirable Men, Chennai Times Most Desirable Men 2016, Kollywood Top Heroes 2016, Chennai Times 2016, Top 4 Stars Chennai Times Most Desirable, Kollywood Heroes Shock

hennai Times Most Desirable Men list is nothing less than a shocker. Top 4 stars of Tamil cinema - Ajith, Vijay, Suriya and Vikram couldn't find a place even in the Top 25 in the Chennai Times Most Desirable Men for 2016 list. Interestingly, all these stars were ranked 2nd (Suriya), 3rd (Vijay), 4th (Ajith) & 5th (Vikram) in the same list last year.

కోలీవుడ్ స్టార్ హీరోలందరికీ బిగ్ షాక్

Posted: 01/27/2017 04:37 PM IST
Chennai times most desirable men ignored top heroes

కోలీవుడ్ లో గనక అగ్రహీరోల జాబితాను గనక పరిశీలిస్తే రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ ల పేర్లు టాప్ ప్లేస్ లో ఉంటాయి. వీరిలో రజనీ, కమల్ ను మినహాయిస్తే మిగతా వారందరికీ మూకుమ్మడిగా ఒకేసారి షాక్ తగిలింది. ఇంత పాపులారిటీ ఉన్న ఈ అగ్రహీరోల పేర్లు ఓ జాబితాలో, అది కూడా టాప్ 25 లో లేకపోవటం విడ్డూరం.

ప్రముఖ జాతీయ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతీ యేడాది ముఖ్యపట్టణాలలో సెలబ్రిటీలకు సంబంధించి జాబితాను విడుదల చేయటం తెలిసిందే. 2016కు గానూ రీజినల్ ఎడిషన్ చెన్నై టైమ్స్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో అజిత్, విజయ్, సూర్య, విక్రమ్ వీరెవ్వరూ లేకపోవటం విశేషం. అంతేకాదు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆ నలుగురి పేర్లు టాప్ 25 లో కూడా మచ్చుకైనా కనిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతేడాది ఈ జాబితాలో సూర్య 2వ స్థానంలో, విజయ్ మూడు, అజిత్ నాలుగు, విక్రమ్ 5వ స్థానాల్లో నిలవగా, ఈసారి లిస్ట్ లోనే లేకుండా పోవటం విడ్డూరం.

బీప్ సాంగ్ వివాదం, పైగా సరైన హిట్ లేని శింబు ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలవగా, గతేడాది మొదటి స్థానంలో ఉన్న ధనుష్ రెండో స్థానానికి పడిపోయాడు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ థర్ట్ పొజిషన్ లో ఉండగా, డబుల్ హ్యాట్రిక్ హీరో విజయ్ సేతుపలి 4, శివకార్తీకేయన్ 5, బౌలర్ అశ్విన్ 6 వస్థానాల్లో నిలిచారు. ఆర్య, కార్తీ, భరత్ రాజ్, మళయాళ నటుడు నివిన్ పౌల్ తర్వాతి స్థానాలు కైవసం చేసుకున్నారు. రానా, సిద్ధార్థ్, సంతానం, జయం రవి, విశాల్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. పబ్లిక్ ఓటింగ్ ఆధారంగానే వారికి స్థానాలు కట్టబెడుతారు.

Chennai Times Most Desirable Men 2016

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Times  Most Desirable Men  2016 List  

Other Articles