ఆ ఇద్దరు పెద్దలు తప్పులు చేయకుండానే ఎదిగారా? రవితేజను మోసం చేశా.. వాడో వేస్ట్ దర్శకుడు | Bandla Ganesh Making Sensation comments Tollywood.

Bandla ganesh shocking comments again

Bandla Ganesh, Bandla Ganesh Sensational Comments, Bandla Ganesh Pawan kalyan, Bandla Ganesh 2017, Bandla Ganesh Ramoji Rao, Bandla Ganesh Rama Naidu, Bandla Ganesh Ravi Teja, Bandla Ganesh 2017 Interview, Bandla Ganesh Interview

Tollywood Producer Bandla Ganesh Makinhg Sensational Comments on Tollywood. Bandla Denies Using Girls as Bait for His Success in Industry. Bandla Ganesh cheats Raviteja.

బండ్ల బ్యాక్ విత్ షాకింగ్ కామెంట్స్

Posted: 01/28/2017 09:13 AM IST
Bandla ganesh shocking comments again

చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, ఆపై కమెడియన్, అటుపై ఓ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు బండ్ల గణేశ్. రాజకీయ నేతలకు బినామీ ఉంటాడనే ఆరోపణలు వినిపించినప్పటికీ, వాటిని చాలా లైట్ గా తీసుకుని ముందుకు సాగుతున్నాడు. తన సినిమాల విషయంలో హీరోలు, నిర్మాతలతో విభేధాలతో వార్తల్లో నిలవటం ఇతని స్పెషాలిటీ. టెంపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత గ్యాప్ తో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో ఓ ఫోటోను ట్విట్టర్ లో ట్వీట్ చేసి మళ్లీ తెర మీదకు వచ్చాడు. ఇక ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలే చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

అమ్మాయిలను ఉపయోగించుకుని పైకొచ్చారన్న విమర్శ పై ప్రశ్నించిన మీడియా ప్రతినిధికి రివర్స్ లో ఓ ప్రశ్న వేశాడు. మీకు రామోజీరావు, రామానాయుడు తండ్రులు ఎవరో తెలుసా? వాళ్లేం చేసి పైకొచ్చారో తెలుసా? తప్పులు చేయకుండానే వాళ్లు ఈ స్థాయికి ఎదిగారా? అంటూ అడిగాడు. తాను చాలా నిజాయితీ పరుడినని, పని లేని వాళ్లే ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటారని చెప్పాడు. ఇక పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. అందరు రాజకీయనేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కల్యాణ్ కు రాదు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకోవడం తెలీదు. స్కీములు రచించడం రాదు. కానీ ప్రజ సేవ చేయాలన్న బలమైన సంకల్సం ఉంది' అని బండ్ల గణేశ్ అన్నారు.

'నా దేవుడు పవన్ కల్యాణ్ కు ఎవరూ సహాయం చేయనవసరం లేదు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు స్వయంగా పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి' అని అంటున్నాడు. గతంలో ఓ సారి హీరో రవితేజను మోసం చేశానని ఇంటర్వ్యూలో గణేశ్ చెప్పాడు. . రవితేజ ఎంతో ఇష్టపడి తన వద్ద పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని పేర్కొన్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన బాద్ షా చిత్రంతో చాలా నష్టపోయానని, దాంతో ఆయనతో విభేదాలు ఏర్పడ్డాయని, అయినప్పటికీ పూరీ సహకారంతో టెంపర్ ను పూర్తి చేశానని చెప్పాడు. అలాగే టాలీవుడ్ లో ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ డ్రగ్స్ తీసుకొంటాడని, అలాంటి వ్యక్తితో పనిచేయడం అత్యంత దురదృష్టకరమని అన్నాడు. త్వరలోనే మంచి ప్రాజెక్టులతో రానున్నట్లు ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla Ganesh  Interview  Shocking Comments  

Other Articles