చిరు, బాలయ్య కూడా ఆ పని చేయలేకపోయారు | Satamanavambavathi Break Even Collections.

Satamanavambavathi 2017 sankranthi winner

Satamanavambavathi, 2017 Tollywood Sankranthi Winner, Sankranthi Satamanavambavathi, Satamanavambavathi Collections, Satamanavambavathi Record, Satamanavambavathi Profts

Satamanavambavathi 2017 Sankranthi Winner. Many wondered if the family entertainer could withstand the two juggernauts but surprising the entire film industry, SB not just won the Sankranthi winner crown but, has also emerged as one of the highest grossers among low-medium budget films.

శతమానం భవతిదే నిజమైన గెలుపు

Posted: 01/27/2017 03:49 PM IST
Satamanavambavathi 2017 sankranthi winner

సంక్రాంతి బరిలో ఈ యేడాది రసవత్తరమైన పోటీయే నెలకొంది. బరిలో నిలిచిన పందెం కోళ్ళలో గెలుపు ఎవరిదనేదనే దానిపై సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పండుగ ముందు వరకు అత్యంత ఆసక్తి కలిగించిన ఇద్దరు అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవటమే కాదు, ఆయా హీరోల అభిమానులను అలరించాయి. మెగాస్టార్ ఖైదీతో పదేళ్ల తర్వాత ప్రభంజనం సృష్టిస్తే... శాతకర్ణితో లెజెండరీ మూవీ అందించాడని బాలయ్యపై ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే సైలెంట్ గా వచ్చి హిట్ టాక్ సంపాదించుకున్న శతమానం భవతి సినిమా వసూళ్లు ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

నాలుగు రోజుల తేడాతో ఈ మూడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిల్లో విజేత ఎవరనేది తేల్చడానికి ట్రేడ్‌ వర్గాలకు సైతం కొంత సమయం పట్టింది. ఎందుకంటే పండగ సెలవుల్లో సినిమాలు విడుదలవడం, అన్నీ మంచి టాక్ తో కలక్షన్లు రాబట్టడం విశేషం. ఫ్యామిలీ వినోదం, చారిత్రాత్మకం, మాస్‌ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాలకు అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఓవర్‌సీస్‌లో సైతం కలక్షన్లు వస్తున్నాయి.

ఇద్దరు అగ్రహీరోలు నటించిన చిత్రాలు ఒకే సారి విడుదల కావడం మూలంగా నిర్మాత దిల్ రాజు అయినప్పటికీ, చివరగా రిలీజ్ అయిన శతమానం భవతికి పెద్దగా థియేటర్లు దక్కలేదు. కానీ, ఆ తర్వాతే సీన్ మారిపోయింది. భారీ బడ్జెట్ తో వచ్చి బ్రేక్ ఈవెన్ కు సమయం తీసుకుంటే, శతమానం మాత్రం లాభాల పంట పండించేస్తోంది. మీడియం బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 27 కోట్ల షేర్ రాబట్టి లాభాల పంట పండించేస్తోంది. అగ్రహీరోలిద్దరూ పెద్దగా మ్యాజిక్ చేయలేదన్న మౌత్  తో శతమానం భవతివైపు ప్రేక్షకులు మళ్లుతున్నారు. ఈ రకంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఓవర్సీస్ లోకూడా శతమానంకు విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఫుల్ రన్ లో 30కోట్ల షేర్ రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ రకంగా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ లాభాల పంట పండించి ఈ సంక్రాంతికి ఫర్ ఫెక్ట్ విన్నర్ గా కిరీటం దక్కించుకుందని ట్రేడ్ పండితులు కంక్లూజన్ కి వచ్చేశారు.

 

ఏరియాల వారీగా కలెక్షన్లు... 

నైజాం - 8. 06 కోట్లు
సీడెడ్ - 2.23 కోట్లు
నెల్లూరు - 49.3 లక్షలు
గుంటూరు - 1.46 లక్షలు
కృష్ణా - 1.47 లక్షలు
ఉత్తరాంధ్ర- 4.08 లక్షలు

13 రోజుల్లో ఏపీ మరియు తెలంగాణ షేర్ - Rs 21.82cr

అమెరికాలో USD700K డాలర్లు. ఓవరాల్ గా 27 కోట్ల షేర్...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satamanavambavathi  Collections  Sankranti 2017  

Other Articles