పవన్ కామెంట్లపై వర్మ క్విక్ రియాక్షన్.. మీ పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదు కదా! RGV on Pawan Kalyan Marriages.

Rgv reaction on pawan kalyan comments

Pawan Kalyan, Ram Gopal Varma, RGV Pawan kalyan, RGV on Pawan Comments, RGV on Pawan kalyan Press Meet, Pawan Kalyan Comments Varma, Pawan Kalyan Ram Gopal Varma, Varma Reaction Pawan Comments

Ram Gopal Varma Tweets on Pawan kalyan again. Says he never comments on Pawan personal life.

పవన్ అభిమానిగానే నా కామెంట్లు: వర్మ

Posted: 01/27/2017 12:32 PM IST
Rgv reaction on pawan kalyan comments

తనపై రాంగోపాల్ వర్మ చేస్తున్న ట్వీట్లపై పవన్ ఇలా స్పందించాడో లేదో వెంటనే రియాక్షన్ ఇచ్చేశాడు. పెళ్లయిన కూతురు ఉండి, పైగా బూతు సినిమాలు చూస్తానని ఓపెన్ గా మాట్లాడే వర్మ లాంటి వాళ్ల ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సిన అవసరం లేదని పవన్ కాసేపటి క్రితం ప్రెస్ మీట్ లో మీడియాకు బదులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వర్మ స్పందించాడు.

ఒక అభిమానిగా పీకే మీద అంచనాలతో మాట్లాడాను గానీ తను చేసుకున్న మూడు పెళ్లిళ్ల లాంటి పర్సనల్ విషయాలను నేనేప్పుడు మాట్లాడలేదు. నా జీవితం నా లైఫ్ స్టైల్ నేను ఆలోచించే విధానం దాక్కోకుండా, దాచకుండా నా పుస్తకం నా ఇష్టంలో మొత్తం విప్పి రాశాను. వాళ్ల ఇంట్లో(మెగా ఫ్యామిలీ) వాళ్ల గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు. మరి వాళ్లు వేరే వాళ్ల ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం? అంటూ అడిగాడు.

నేను తన మీద ఇష్టంతో నిజాయితీగా మాట్లాడాను గానీ క్రిటిసైజ్ చేయడానికి కాదని తాను తెలుసుకోకపోవటం నా దురదృష్టం.పనవ్ కి, అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు, జనసేన పార్టీ కి ఆల్ ది బెస్ట్, బై అంటూ తెలిపాడు. అలాగని వర్మ మనస్ఫూర్తిగా సారీ చెప్పాడని అనుకోవడానికి నమ్మడానికి వీల్లేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Ram Gopal Varma Tweets  

Other Articles