పెద్ద ప్రాబ్లమ్ లో లక్కున్నోడు... విష్ణుపై పోలీస్ కేసు | A complaint is lodged against Manchu Vishnu.

Case filed against manchu vishnu

Manchu Vishnu, Manchu Vishnu Police Case, Manchu Vishnu Country Division Comments, Police Case against Manchu Vishnu, Manchu Hero Police Complaint, Case Against Hero Vishnu, Case on Manchu Vishnu

Complaint is lodged against Manchu Vishnu at Neredmet and Vanasthalipuram Police Station over India’s division Comments.

మంచు హీరోపై పోలీస్ కేసు నమోదు

Posted: 01/27/2017 01:07 PM IST
Case filed against manchu vishnu

సింగం-3 రిలీజ్ వాయిదా పడటంతో సడన్ గా తెర మీదకు వచ్చి ఈ వారం లో ఏకైక సినిమాగా మంచు విష్ణు లక్కునోడితో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే పరమబోరింగ్ కంటెంట్ ఉండటంతో ఫస్ట్ అటకే సినిమా ఫలితం ఏంటో జనాలకు తెలిసిపోయింది. చూస్తుంటే సినిమాకు పెద్ద దెబ్బే పడేలా ఉంది. ఇదిలా ఉంటే విష్ణుపై పోలీస్ కేసు నమోదైంది. అలాగని అది లక్కునోడు సినిమా కోసం కాదు, విష్ణు చేసిన కామెంట్ల గురించి...

ఇండియాను రెండు ముక్కలు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు మంచు విష్ణుపై హైదరాబాద్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విష్ణుపై దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నరేంద్ర మోదీ విచార్ మంచ్ ఫిర్యాదు చేసింది. విష్ణు బాధ్యతారాహిత్యంతో మాట్లాడారని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని సంఘం నాయకులు ఆరోపించారు.

కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, దేశంలో ప్రభుత్వాలు దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఏర్పాటవుతున్నాయని, అయినా, ఇక్కడి ప్రజలకు సరైన గుర్తింపు రావడంలేదని, అలాంటప్పుడు కలసి వుంటే లాభం లేదని, ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు దేశాలుగా విభజించాలని విష్ణు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు విష్ణు వ్యాఖ్యలను ఉటంకిస్తూ, అవి దేశసమగ్రతను దెబ్బతీసేవిధంగా ఉన్నాయంటూ వెస్ట్ మారేడ్ పల్లి లో ఫిర్యాదు చేయగా, దానిపై కూడా కేసు నమోదయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Police Complaint  Case  

Other Articles