చిరు హీరోయిన్ ను అలా వాడేసుకుంటారంట... | Rimi Sen campaign for UP elections.

Actor rimi sen joins bjp

Rimi Sen, BJP, Rimi Sen BJP, Rimi Sen Politics, Rimi Sen 2017, Rimi Sen UP Election Campaign, Sunny Deol BJP, Rimi Sen Join BJP, Uttar Pradesh Elections

Inspired by PM Modi, Actress Rimi Sen joins BJP ahead of assembly elections. She campaign for UP elections. Sunny Deol likely to follow.

రాజకీయాల్లోకి మరో హీరోయిన్

Posted: 01/25/2017 09:06 AM IST
Actor rimi sen joins bjp

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అటెన్షన్ కొట్టేసేందుకు గ్లామర్ ను వాడేసుకోవాలని పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు పార్టీల్లో చక్రం తిప్పుతుండటం చూశాం. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వంతు వచ్చింది. ధూమ్ నటి రిమీ సేన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లో చేరిపోయింది.

పశ్చిమబెంగాల్ కు చెందిన రిమీ సేన్ ముంబైలో స్థిరపడి ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినిమాల వైపు మళ్లింది. 2003లో ప్రియదర్శన్ దర్శన్ దర్శకత్వంలో వచ్చిన హంగామా చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో చేసింది. అమితాబ్ తో బాగ్బన్ లో ఓ గెస్ట్ రోల్ చేసింది కూడా. 2005 లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తో అందరివాడు చిత్రంలో నటించింది కూడా. 2015లో రియాల్టీ షో బిగ్ బాస్లో పాల్గొంది. మారథాన్ కిడ్ బుథియా సింగ్ ఆత్మకథపై ఈ మధ్య వచ్చిన సినిమాను రిమీ సేనే నిర్మించింది కూడా.

మోదీ నాకు ఆదర్శం. ఆయన పాలనతీరు నచ్చే నేను బీజేపీలో చేరాను అని రిమీ సేన్ ప్రకటించుకుంది. ఎలాంటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా ఆమెకు కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. మరోవైపు ధర్మేంధ్ర తనయుడు సన్నీ డియోల్ ను కూడా తమ పార్టీలోకి లాగేందుకు బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఇదిలా ఉంటే  కాంగ్రెస్ యూపీ ఎన్నికల ప్రచారం కోసం నగ్మాను రంగంలోకి దించనుంది. 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rimi Sen  BJP  Sunny Deol  Uttar Pradesh Elections  

Other Articles