మెగాస్టార్ బ్రేకప్ నిజమే... అయితే ఏంటి? | Bachchan Couple really break up.

No response amitabh and jaya are living separately

Amitabh Bachchan, Jaya Bachchan, Bachchan Couple Break Up, Amar Singh Bachchan Couple, Amitabh and Jaya, Amitabh Bachchan and Jaya Bachchan separately

Amar Singh says Amitabh Bachchan and Jaya Bachchan have been living separately. In Past Amitabh and Jaya have always quashed these kind of rumours.

బిగ్ బీ బ్రేకప్ పై ఇంకా స్పందన రాలేదు

Posted: 01/24/2017 05:00 PM IST
No response amitabh and jaya are living separately

నాలుగు దశాబ్దాల తర్వాత మెగాస్టార్ వైవాహిక జీవితం తిరిగి వార్తల్లో నిలిచింది. బచ్చన్ ఫ్యామిలీ మాజీ స్నేహితుడు, అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలే చేశాడు. గత కొంతకొన్నేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారంటూ ఓ మరాఠీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా. బచ్చన్ బంగ్లాలు అయిన ప్రతిక్ష, జనక్ లలో వీరు ఉంటున్నట్లు మీడియా కొన్నేళ్ల క్రితమే చెప్పింది కూడా.

అయితే ఇలాంటి రూమర్లు కొత్తేం కాదు. వీరిద్దరి వైవాహిక జీవితంపై ఎప్పటికప్పుడు ఇలాంటి కథనాలు రావటం, ఆ వెంటనే తమ ప్రేమను వ్యక్తం చేస్తూ పోస్టులు చేయటం లాంటివి చూశాం. అంతెందుకు రేఖతో అఫైర్ వ్యవహారంలో కూడా జయ చాలా కూల్ గా వ్యవహరించడం చూశాం. మరోవైపు కోడలు ఐశ్వర్య రాయ్ తో కూడా అత్తకు పడటం లేదన్న వాదన కూడా వినిపిస్తున్నప్పటికీ, దానిని కూడా కొందరు కొట్టిపడేస్తున్నారు. రీసెంట్ గా స్టార్ డస్ట్ అవార్డుల వేడుకలో కూడా ఈ ఇద్దరు ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యారో అందరికీ తెలుసు. అలాంటిది ఇంతలా కామెంట్ చేయాల్సిన అవసరం అమర్ కు ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.

రీసెంట్ గా ములాయం, అఖిల్ వ్యవహారంలో తన జోక్యం ఉందన్న ఆరోపణలు వినవస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఆరోపణలు అమర్ కు కొత్తేం కాదు. అంబానీ ఫ్యామిలీలో చిచ్చు, ఆపై అమితాబ్ ఇంట కూడా గొడవలకు అమర్ కారణమని ఆరోపణలు ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావించే సమయంలో బిగ్ బీ ఇంట బ్రేకప్ గురించి స్పందించినట్లు తెలుస్తోంది. మరి దీనిపై మెగాస్టార్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amar Singh  Amitabh Bachchan  Jaya Bachchan  Break Up  

Other Articles

Today on Telugu Wishesh