మహేష్ శాటిస్ఫై కావటం లేదా? | Mahesh Babu treat not on Republic day.

Mahesh babu fans disappointed again

Mahesh Babu, AR Murugadoss, Mahesh Babu Murugadoss, Mahesh Babu Movie Teaser, Mahesh Murugadoss First Look, Mahesh Babu Republic day Teaser, Mahesh Fans Disappoint, Mahesh Hyderabad Most Desirable Men, Hyderabad Most Desirable Men list 2017

Since the commencement of the Mahesh Babu AR Murugadoss film’s shoot, the makers haven’t released a single poster till date. The film’s title, too, has not been announced. There were rumours that the makers will release a special poster for Diwali, but that didn’t happen. Even for New Year and Sankranthi, there was no hint of a glimpse from this highly anticipated flick. While there were reports that the title and a short teaser will be unveiled on Republic day, there is no official confirmation from the makers till now. Also, there is no clarity on the film’s release date. Superstar fans are very disappointed with this long wait.

మహేష్ సినిమా మళ్లీ క్లారిటీ మిస్సయ్యింది

Posted: 01/24/2017 04:08 PM IST
Mahesh babu fans disappointed again

షూటింగ్ మొదలుపెట్టక ముందే కాంబో, పైగా భారీ బడ్జెట్ తో సౌత్ లోనే క్రేజీ ప్రాజెక్టుగా మారింది మహేష్-మురగదాస్ సినిమా. పైగా మధ్యలో హాలీడేస్ అంటూ గ్యాప్ తీసుకున్నప్పటికీ ఫాస్ట్ గానే షూటింగ్ లో పాల్గొన్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని కీలకసన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

స్టార్ హీరోల దగ్గరి నుంచి చిన్న సినిమాల దాకా షూటింగ్ మొదలుపెట్టిన కొద్దిరోజులకే ఫస్ట్ లుక్, పోస్టర్లంటూ రచ్చ చేసేస్తున్నారు. కానీ, అందుకు భిన్నంగా మహేష్ సినిమా ఇంత వరకు టైటిల్ కూడా అనౌన్స్ కాలేదు. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా ఎప్పటికప్పుడు ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ విషయంలో స్పష్టత ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్న నిర్మాతలు చివరకు రిపబ్లిక్ డేను ఫిక్స్ చేయటం చూశాం.

కానీ, ఇప్పుడు తీరా విషయానికొస్తే ఆ తేదీకి కూడా ఫస్ట్ లుక్ రావటం లేదని తెలుస్తోంది. టైటిల్ విషయంలో సంతృప్తి చెందకపోవటంతోనే ఇలా ఫస్ట్ లుక్ టీజర్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇప్పుడు రిలీజ్ డేట్ పై కూడా మల్లాగుల్లాలు పడుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలతో ప్రిన్స్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఇంతగా సస్పెన్స్ మెయింటెన్ చేస్తుండంతో ఉన్నపళంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అర్థమౌతోంది. ప్రస్తుతానికైతే ముంబై నుంచి పుణే అటు నుంచి బ్యాంకాక్ కి షెడ్యూల్ కి ఫ్లాన్ చేశాడు దర్శకుడు మురగదాస్.

ఇదిలా ఉంటే హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో మహేష్ రెండో స్థానానికి పడిపోయాడు. రోహిత్ ఖదేల్ వల్ అనే మోడల్ ఫస్ట్ స్థానంలో నిలవగా, ప్రిన్స్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఈ యేడాది చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉండటంతో వచ్చే ఏడాది మళ్లీ సత్తా చాటి టాప్ ఫ్లేస్ లో నిలుస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  Teaser  First look  Teaser  

Other Articles

Today on Telugu Wishesh