మహేష్ తర్వాత ఎన్టీఆర్, మరి పవన్ సంగతి ఏంటి? | After Mahesh Babu Junior NTR reacted on Satakarni movie.

Junior ntr reaction after gpsk watch

Gautamiputra Satakarni, Junior NTR, Tweets, Mahesh Babu

Junior NTR, Gautamiputra Satakarni, NTR reacted on Satakarni movie, Junior NTR Director Krish, NTR tweets on Satakarni, NTR ignored Khaidi No 150, Mahesh Babu NTR, Junior NTR Bala Krishna, NTR praise Satakarni

శాతకర్ణి చూశాక ఎన్టీఆర్ రియాక్షన్...

Posted: 01/16/2017 09:44 AM IST
Junior ntr reaction after gpsk watch

ఓవైపు ఇద్దరు అగ్రహీరోల సినిమాలు కలెక్షన్లు కుమ్మకుంటూ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంటే టాలీవుడ్ సెలబ్రిటీలంతా తారతమ్యాలు మరిచి వారిద్దరినీ ప్రశంసిస్తూ, అభినందనలు తెలుపుతున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇంట్లో ఉన్న హీరోల నుంచే రెస్పాన్స్ లేకపోతే ఎలా? ఖైదీ విషయంలో పవన్ కళ్యాణ్, శాతకర్ణి విషయంలో అబ్బాయి జూనియ‌ర్ ఎన్టీఆర్ రీలీజ్ కు ముందు ఆల్ ది బెస్ట్ చెప్పటంతోనే సరిపెట్టారా అంటూ విమర్శలు వినిపించాయి.

అయితే జూనియర్ కి ఇవి చెవిన పడ్డాయో ఏమో! వెంటనే స్పందించాడు. ఆదివారం తాను సినిమాని చూశానని చెబుతూ, 'సాహో నందమూరి బాలకృష్ణ... సాహో డైరెక్టర్‌ క్రిష్‌... సాహో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా యూనిట్' అని పేర్కొన్నాడు. 'ఇది ఒక తెలుగువాడి విజయం. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం' అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు రెండు అగ్ర చిత్రాల గురించి స్పందించిన విషయం తెలిసిందే.

 

బిగ్ మూవీలతో టాలీవుడ్ లో సంక్రాంతి సంబరాల వర్షం కురుస్తోందన్న మహేశ్.. ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ కు వెల్ కం చెప్పే క్రమంలో.. ‘‘మిమ్మల్ని మిస్ అయ్యాం. వెల్ కం బ్యాక్’’ అని చెప్పటమేకాదు.. చిరు లుక్స్ అద్భుతమని.. ఆయన మేజిక్ ను పొగిడేశాడు. ‘‘మీ విజన్ కు.. కన్విక్షన్ కు హ్యాట్స్ ఆఫ్’’ అని చెప్పటమేకాదు.. టాలీవుడ్ లో ఆయన తాజా ప్రదర్శన ఉత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలుస్తుందని బాలయ్యకు భారీ పొగడ్తనే కట్టబెట్టాడు. ఏమైనా.. రెండు అగ్ర సినిమాల గురించి వీరంతా రియాక్ట్ అవుతున్న ట్వీట్లు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయ్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh