కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో శర్వ పరుగులు Shatamanam Bhavati 1st day collections

Shatamanam bhavati 1st day collections

khaidi no 150, gautamiputra shatakarni, megastar chiranjeevi, nataratna nandamuri balkrishna, america collections, shatamanam bavati, sharvanand, telugu movies, tollywood top heros, entertainment

Young hero Sharwanand's Shatamanam Bhavati which released yesterday opened up with a superb start at the box office. The film remained as career best collected movie for Sharwanand on opening day.

కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో శర్వ పరుగులు

Posted: 01/15/2017 03:53 PM IST
Shatamanam bhavati 1st day collections

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన శతమానం భవతి చిత్రం తన కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, నందమూరి బాలకృష్ణ శతచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఓ వైపు అంతకుముందుగానే రిలీజ్ అయ్యి భారీ వసూళ్లను రాబడుతున్న తరుణంలో ఇటు శర్వానంద్ నటించిన చిత్రం కూడా ఆయన కెరీర్ లో అత్యధిక తొలిరోజు వసూళ్తు రాబట్టిన చిత్రంగా నిలిచింది. శర్వా గత చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా 1.5 కోట్ల తొలిరోజు కలెక్షన్లను రాబట్టగా, శతమానం భవతి మాత్రం ఏకంగా అంతకు రెట్టింపు కలెక్షన్లను రాబట్టింది. దీంతో సంక్రాంతి బరిలో నిలచిన యంగ్ హీరో చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అదరించారు.

ఈ సినిమా విడుదలైన తొలి రోజునే 3.04 కోట్ల రూపాయలను ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టింది. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్ లో 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో 31 లక్షలు, తూర్పులో 39 లక్షలు, వైజాగ్ లో 46 లక్షలు, దుంటూరులో 24 లక్షలు, కృష్ణాలో 16 లక్షలు, నెల్లూరులో 8లక్షల రూపాయలను రాబట్టింది. ఇక అమెరికాలో చిత్రం శనివారం ఒక్కరోజు మాత్రమే 205 వేల డాలర్లను అర్జించింది. దీంతో శర్వానంద్ కూడా పండగ పూట కలెక్షన్ల పరుగులు పెడుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shatamanam bavati  sharvanand  box office collections  tollywood  entertainment  

Other Articles

Today on Telugu Wishesh