అంతా ఊహించినట్లుగానే.. అభిమానుల దాహం తీరుస్తూ... కాదు, కాదు... బాక్సాఫీస్ లు షేక్ అయిపోయేలా ఇద్దరు సీనియర్ హీరోలు అసలైన పండగ మజాను అందజేస్తున్నారు. ఒకరేమో మాస్ రీఎంట్రీ, మరోకరేమో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ మైలురాయిలను అంతే అదిరిపోయే విక్టరీలతో అందుకున్నారు. మౌత్ పబ్లిసిటీతో పాటు.. పాజిటివ్ రివ్యూలు భారీ వసూళ్లకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఇద్దరూ యుఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసేయటం అంటే మాములు విషయం కాదు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆదివారంకి 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టగా.. నటసింహ నందమూరి బాలకృష్ణ ఎపిక్ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మిలియన్ మార్కును దాటేసింది. చిరు సినిమా దాదాపు 200 స్క్రీన్లలో రిలీజైంది అమెరికాలో. మంగళవారం ప్రిమియర్లతోనే 1.25 మిలియన్ల దాకా వసూలు చేసిన ‘ఖైదీ నెంబర్ 150’.. తర్వాత కొంచెం నెమ్మదించింది. శని ఆదివారాల్లో మళ్లీ పుంజుకుని 2 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సినిమా ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల మార్కును దాటొచ్చు.
మరోవైపు బాలయ్య కు మల్టీఫ్లెక్సుల్లో ఆదరణ కాస్త తక్కువగా ఉండేది. కానీ, కథ, పైగా క్రిష్ డైరక్షన్, అంతకంటే ఎక్కువ బిజినెస్ భారీగా జరగటంతో దాదాపు 120 స్క్రీన్లలో రిలీజైంది. బాలయ్య సినిమా బుధవారం ప్రీమియర్ల ద్వారా 3.5 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ఆదివారం మిలియన్ మార్కును దాటేసింది. బాలయ్యకు అమెరికాలో ఇది తొలి మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. ఇప్పటిదాకా ‘లెజెండ్’ సినిమా 4.1 లక్షల డాలర్లతో హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతూ వచ్చింది. ‘శాతకర్ణి’ ఫుల్ రన్లో 1.5 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునే అవకాశముంది. నైజాంలో కూడా ఫస్ట్ డే అత్యధిక వసూలు రాబట్టం, 40 ఏళ్ళ బాలయ్య కెరీర్ లోనే ఓవరాల్ ఫస్ట్ డే కలెక్షన్లు దాదాపు 19 కోట్లు రాబట్టిన సినిమాగా శాతకర్ణి నిలిచిపోయింది.
అల్రెడీ చిరు రెండో రోజుకే 50 కోట్ల మార్క్ అందుకోగా, బాలయ్య కూడా అలవోకగా ఆ ఫీట్ సాధించేశాడు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసిన చిరు నేరుగా 2 మిలియన్ క్లబ్బును టచ్ చేసి భీభత్సం సృష్టించగా, బాలయ్య కూడా తన శతకంతో మిలియన్ మార్క్ ని అందుకుని సత్తా చాటాడు. ఇక వీటితోపాటే రిలీజ్ అయిన శతమానం భవతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా బాగానే కలెక్షన్లు రాబడుతుండటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more