చిరు ఖైదీ నెంబర్ 150 రిలీజ్ డేట్ కన్ఫామ్.. Dasari and Raghavendra Rao are chief guest for chiru's khaidi no 150

Dasari narayana rao and raghavendra rao are chief guest for chiru s khaidi no 150

Ram Charan, Khaidi No 150, Release, Date, Release Date, Pre Release, Khaidi No 150 Release Date, Megastar, Chiranjeevi, Dasari Narayana Rao, Raghavendra Rao, mega star, mega power star, NBK100, NBK, Balakrishna, Ram Charan Facebook live, Khaidi No 150 Release Date Announcement, Khaidi No 150 Release Date Announcement, Ammadu Lets Do Kummudu Song, Khaidi No 150 official release date

The two director gaints of tollywood Dasari Narayana Rao and K. Raghavendra Rao will grace the pre release event of Khaidi No. 150 as the chief guests, conformed by producer and actor mega power star ramcharan

చిరు ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ డేట్ కన్ఫామ్..

Posted: 01/03/2017 07:39 PM IST
Dasari narayana rao and raghavendra rao are chief guest for chiru s khaidi no 150

తెలుగు సినీవినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుని స్టార్ గా, సుప్రీం స్టార్ గా, అలా అలా వటుడింతై అన్నట్లు మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తరువాత సినీమాలకు దూరమైన.. ఈ మధ్యకాలంలో మళ్లీ రీ ఎంట్రీ చేస్తూ.. తన అత్యంత ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 విడుదలపై అధికారికంగా ప్రకటించారు చిత్రం నిర్మాత, ప్రముఖ హీరో మోగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్.

'ఖైదీ నెంబర్ 150'  చిత్రానికి సంబంధించి ఈ నెల 7వ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నామని తెలిపారు. ఇంతకుముందు ప్రకటించినట్లు ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుండా గుంటూరు, విజయవాడ రహదారిపై వున్న హాయ్ లాండ్ లో ప్రి రిలీజ్ వేడుక అత్యంత రమణీకంగా సాగుతుందని, అభిమానులందరూ తమ మెగాస్టార్ ను చూసేందుకు తరలిరావాలని రాంచరణ్ కోరారు. ఈ వేడుకకు దర్శక రత్న దాసరి నారాయణ రావు, మరో దర్శక దిగ్గజం కె. రాఘవేందర్ రావులు ముఖ్యఅతిధులుగా హాజరవుతారని చెప్పారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఈ నెల 12న విడుదల చేయాలని భావించామని చెప్పారు. అయితే రెండు అగ్ర చిత్రాలు ఒక్కసారి విడుదల కావడం చిత్రపరిశ్రమకు మంచి పరిణామం కాదని మెగాస్టార్ చెప్పిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక్క రోజు ముందుగా అనగా ఈ నెల 11న విడుదల చేయడానికి తమ నిర్మాణ సంస్థ సిద్దమయ్యిందన్నారు. బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ డేట్ కచ్చితంగా తెలిసిపోయింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి, వివి వినాయక్ సహా పలువురి అనుమతి తీసుకుని చిత్ర విడుదలను ప్రీపోన్ చేస్తున్నామని చెప్పారు.

కాగా, బాలయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ క్లాష్ పై అభిమాని ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన రాంచరణ్.. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి హ్యాపీగా విడుదలవ్వొచ్చని, అందులో ఎలాంటి ఇబందిలేదని పేర్కొన్నాడు. గతంలో తన సినిమా, మహేశ్ సినిమా సంక్రాంతికి ఒకేసారి విడుదలయ్యాయని, రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు సాధించాయని చెప్పాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రం కూడా మంచి హిట్ కావాలని అకాంక్షించిన రాంచరణ్.. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణలకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Megastar  Chiranjeevi  Ram Charan  Dasari Narayana Rao  Raghavendra Rao  tollywood  

Other Articles