వాట్సాప్ లో వైరల్ అవుతున్న బచ్చన్ లేడీస్ జోక్ | Aishwarya lightens demonetisation gloom.

Demonetisation strongly affected on bachchan family

Aishwarya Rai, Jaya Bachchan, Pink Saree Photos, Bachchan ladies joke, Big B Whatsapp, Aish And Jaya Saree, Pink Saree Joke Whats app, Bachchan Family demonetization, demonetization whats app joke, Bachchan ladies same saree

Jaya Bachchan and Aishwarya Rai pink saree joke now viral on note ban effect.

మెగా ఫ్యామిలీకి తప్పని నోట్ల కష్టాలు

Posted: 01/04/2017 10:06 AM IST
Demonetisation strongly affected on bachchan family

ఫన్నీయే అయినప్పటికీ వాట్సాప్ లో బిగ్ బీ ఫ్యామిలీపై వేసిన ఓ జోకు తెగ పేలిపోతుంది. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం చానాళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీపై పడిందని అందులో ఛలోక్తులు విసురుతున్నారు. బచ్చన్ లేడీస్ ఒకే చీరతో నెట్టుకొస్తున్నారంటూ వాట్సాప్ లో షేర్ చేసిన జోకు తెగ వైరల్ అవుతోంది.

2010లో అమితాబ్ భార్య జయా బచ్చన్ ఓ కార్యక్రమానికి పింక్ కలర్ చీరతో హాజరైంది. మళ్లీ 2011లో ఒకే కలర్, డిజైన్‌ తో ఉన్న చీరను బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యరాయ్ ఇంకో ఫంక్షన్‌కు అటెండైంది. మళ్లీ 2014లో జరిగిన ఓ కార్యక్రమానికి అలాంటి చీర (అదేనేమో మరి) కట్టుకునే హాజరైంది జయా బచ్చన్. దీంతో పలువురు నెటిజన్లు ఆ సంఘటనలను తీసుకుని నోట్ల రద్దుపై జోకులు పేల్చుతున్నారు.

ఒకే చీరను అత్తా కోడళ్లు వివిధ సందర్భాల్లో కట్టుకున్న ఫొటోలతో నోట్ల కష్టాలు పాపం అంటూ కామెంట్లు పెట్టారు. గత సెప్టెంబర్ లోనే ఈ ఫోటోలు ఆన్‌ లైన్‌ లో హల్‌ చల్‌ చేశాయి. సెలబ్రిటీలు కరెన్సీ కష్టాలకు మినహాయింపు కాదు అంటూ నెటిజన్లు మరోసారి వీటిని వెలుగులోకి వైరల్ చేసేశారు. జస్ట్ ఫర్ ఫన్ కావటంతో బచ్చన్ లేడీస్ కూడా దీనిని లైట్ తీసుకుంటారనే అనుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai  Jaya Bachchan  Pink Saree  Whats app joke  

Other Articles