చిరు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ ఎలా పోగొట్టుకుంది | Senior Actress miss chance to pair up with Chiranjeevi.

Actress sulakshana about chiranjeevi

Actress Sulakshana, Sulakshana Chiranjeevi, Chiranjeevi Sulakshana, Sulakshana Interview, Tollywood actress Sulakshana, Heroine Sulakshana, Sulakshana desire, Classic Heroine about Chiru, Subhodayam Actress Sulakshana, South Actress Sulakshana, Senior Actress Sulakshana

Senior Actress Sulakshana about Chiranjeevi Charisma.

చిరుతో ఛాన్స్ గురించి సీనియర్ హీరోయిన్

Posted: 12/31/2016 09:28 AM IST
Actress sulakshana about chiranjeevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ, ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని చేజేతులారా వద్దనుకుందంట. ఆపై ఇప్పుడు తెగ ఫీలయిపోతుంది. అయితే అది 150వ చిత్రం కోసం కాదులేండి. అసలు అది ఇప్పటి సంగతి కానేకాదు...

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి చిత్రాలతో అలరించిన హీరోయిన్ సులక్షణ ఈ మధ్య ఓ టీవీ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. హఠాత్తుగా కనుమరుగై చాలా ఏండ్ల తర్వాత ఆమె మళ్లీ కనిపించింది. ఈ సందర్భంగా తన లైఫ్ కి సంబంధించిన బోలెడన్నీ విషయాలను చెప్పుకొచ్చింది. అన్నేళ్ల తన కెరీర్ లో చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించలేకపోయానన్న ఒక్క బాధ మాత్రం తనకుందని ఆమె అంటున్నారు. చిరంజీవి మంచి డ్యాన్సర్ అని, తాను కూడా క్లాసికల్ డ్యాన్సర్ ని అని చెప్పిన ఆమె ఆ కోరిక తీరలేదని అంటోంది. అయితే అప్పటికీ చిరుతో ఒక సినిమాలో చేసినప్పటికీ, అందులో హీరోయిన్ గా మాత్రం నటించలేకపోయిందంట.

‘బేబీ డాలీ’గా బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించిన తాను, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శుభోదయం’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యానని చెప్పుకొచ్చారు. దక్షిణాది అన్ని భాషల్లో ఆమె సుమారు 350 చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. నిజానికి ఆమె తన అసలు పేరు శ్రీదేవి. అప్పటికే ఒక శ్రీదేవి చిత్ర రంగంలో ఉండటంతో..తన పేరును సులక్షణగా మార్చారని అన్నారు.

1992 వరకు సినీరంగంలో సులక్షణ, ప్రముఖ సంగీతదర్శకుడు ఎం.ఎస్.విశ్వనాధన్ కుమారుడు గోపీకృష్ణను ప్రేమించి పెళ్లాడినది. అయితే పెళ్ళి తర్వాత సినిమాలలో నటించాలని సులక్షణ కోరుకోవడముతో వీరిద్దరూ విడిపోయారు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత మళగర్ అనే తమిళ్ సీరియల్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sulakshana  Chiranjeevi  

Other Articles