కూతురి అఫైర్ పై కాలి అంత పని చేశాడా? | Shakti Kapoor That's total crap on daughter dragging.

Shakti kapoor yanks shraddha back home

Shraddha Kapoor, Shakti Kapoor, Shakti Kapoor Shraddha Kapoor, Shraddha Kapoor affair, Shraddha Kapoor Farhan Akhtar, Farhan Akhtar Shraddha Kapoor, Shakti Kapoor Farhan Akhtar, Shakti Kapoor reacts to rumours, Shakti Kapoor on daughter affair, Shakti Kapoor drag Shradda kapoor

Shakti Kapoor reacts to rumours of him dragging her daughter Shraddha Kapoor out of Farhan's apartment.

పర్హాన్ తో సహజీవనంపై శ్రద్ధా తండ్రి

Posted: 12/30/2016 05:17 PM IST
Shakti kapoor yanks shraddha back home

పర్హాన్ అక్తర్-నటి శ్రద్ధాకపూర్ అఫైర్ వ్యవహారం బాలీవుడ్ లో గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రాక్ ఆన్ -2 సమయంలో ఫర్హాన్ తో ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్ మూలంగానే భార్యకు విడాకులు ఇచ్చేశాడని చెప్పుకున్నాం. ఇక అడ్డుతొలగిపోవటంతో అతనితో సహజీవనం చేస్తోందని మీడియా కథనాలు రాసేసింది. అంతేనా తాను కొత్త ఇంట్లో నివాసానికే తన మకాం కూడా మార్చేసిందని ఆ మధ్య చెవులు కొరుక్కుతున్నారు.

ఇక తాజాగా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... విషయం తెలుసుకున్న సీనియర్ నటుడు, శ్రద్ధా తండ్రి శక్తికపూర్, వెంటనే ఫర్హాన్ నివాసానికి వెళ్లి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడట. ఆ తర్వాత ఆమెను వాళ్ల ఇంటికి శక్తికపూర్ తీసుకువెళ్లాడట.కూతురి అఫైర్ పై కాలిన శక్తికపూర్ ఈ పని చేశాడంటూ చెప్పుకొచ్చాయి. అయితే వార్త వెలువడిన కొద్దిసేపటికే శక్తికపూర్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఈ విషయంపై శక్తికపూర్ ను మీడియా ప్రశ్నిస్తే... అదంతా పచ్చి అబద్ధం అని చెబుతున్నాడు. 35 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఇలా ప్రవర్తిస్తానని మీరు నమ్ముతారా? అని ప్రశ్నించాడు. పైగా పర్హాన్ చాలా బుద్ధిమంతుడు, టాలెంటెడ్ ఫెల్లో అంటూ ప్రశంసలు కురిపించాడు. దయచేసి ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ విజ్నప్తి చేశాడు. మరోవైపు అఫైర్ వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ జంట ఖండిస్తుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakti Kapoor  Shraddha Kapoor  Farhan Akhtar affair  

Other Articles