రత్తాలు పాట మొత్తం చిరు రచ్చ రచ్చే... | Rattalu Item Song from Khaidi released.

Khaidi no 150 rattalu song sensation in youtube

Khaidi No 15, Rattalu Rattalu song, Khaidi No 150 Item Song, lawrence Ratalu song, Chiru inn Rattalu song, Rattalu song making, Khaidi Rattalu song Video, Chiranjeevi Rattalu song, Chiru in Rattalu song

Khaidi No 150 Item Song Rattalu Rattalu released and album trending now.

ఖైదీ రత్తాలు సాంగ్ కేకపుట్టిస్తోందిగా...

Posted: 12/31/2016 11:24 AM IST
Khaidi no 150 rattalu song sensation in youtube

చిరు ఖైదీ నంబర్ 150 వ చిత్రం ఐటెం సాంగ్ వచ్చేసింది. రత్తాలు రత్తాలు అంటూ సాగే పాటను అఫీషియల్ గా రిలీజ్ చేసేసింది లహరి మ్యూజిక్ సంస్థ. పూర్తి లిరిక్స్ తో కూడిన వీడియో ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారిపోయింది. మొదటి నుంచి మెగా ఐటెం సాంగ్ పై ఎగ్జయిట్ మెంట్ ఎక్కువగా ఉండటంతో అంతా ఒక్కసారిగా ఎగబడి పోతున్నారు.

బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ... డెడ్లీ డాన్స్ గెట్ రెడీ అంటూ సాగే సాంగ్ ఆపై రత్తాలు రత్తాలు.. ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు... అంటూ సాగే సాంగ్ అదిరిపోయింది. మాస్ బీట్ లకు కేరాఫ్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ చిరు మార్క్ కి తగ్గకుండా ఊగిపోయే బీట్ అందించాడు. లిరిక్స్ వీడియోలో మేకింగ్ వీడియోతో పాటు చిరు స్టెప్పులు కూడా ఇరగదీసినట్లు అర్థమౌతోంది. లారెన్స్ ఈ పాటకు స్టెప్పలందించాడు. ఇక పాటలో లక్ష్మీరాయ్ అందాలతో కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

ఉర్తూతలూగించే మాస్ బీట్ లిరిక్స్ యూట్యూబ్ లో సంచలనంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆడియోలో మ్యూజిక్ ను బట్టి వీడియోలో చిరు ఇంకా ఏ రేంజ్ లో ఇరగదీసి ఉంటాడో. ఈ పాటతో కలిపి ఇప్పటికే నాలుగు పాటలు రిలీజ్ కాగా.. అన్ని ట్రెండింగ్ గానే ఉన్నాయి. ఇక మిగిలిన పాట న్యూ ఇయర్ కానుకగా రానుంది. జనవరి 4న ప్రీరిలీజ్ కోసమే ఇప్పడు అందరి కళ్లు వెయిట్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Item Song  Rattalu Rattalu  Chiranjeevi and Raai Laxnmi  

Other Articles