2016-మూవీ ఆఫ్ ది ఇయర్ మీచేతుల్లో... | tollywood best movie 2016.

Movie of the year tollywood 2016

Tollywood 2016, 2016 tollywood best movie, best tollywood movies, tollywood review 2016, tollywood movies 2016, tollywood top movie, 2016 tollywood review, best movie tollywood, Tollywood best movie of year, tollywood 2016 best movie, tollywood 2016 round up

Best Movie of the year tollywood 2016.

2016 - టాలీవుడ్ బెస్ట్ మూవీ

Posted: 12/30/2016 04:46 PM IST
Movie of the year tollywood 2016

టాలీవుడ్ లో మరో ఏడాది దొర్లిపోయింది. మొత్తం 105 సినిమాలు... పాతిక పైగా డబ్బింగ్ సినిమాలు. కానీ, పట్టుమని 20 శాతం కన్నా ఎక్కువ సక్సెస్ లేదు. బ్లాక్ బస్టర్లు అనిపించుకుని నిర్మాతలకు లాభాలు తెప్పించింది అరడజను సినిమాలే. హిట్ ఓ పది సినిమాలు. ఆపై మంచి టాక్ మూటగట్టుకుంది ఓ నాలుగైదు మాత్రమే. ఆ లెక్కన గత నాలుగైదేళ్లుగా కొనసాగుతూ వస్తున్నట్లే టాలీవుడ్ ప్రతీయేడు లాగే ఈ యేడు అంతంత మాత్రంగానే ముగిసింది.

ఏడాది మొదటి రోజే ఓ హిట్, ఓ రెండు డిజాస్టర్ లతో టాలీవుడ్ మొదలైంది. నేను శైలజతో తిరుమల కిషోర్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించగా, నాగశౌర్య అబ్బాయితో అమ్మాయి, చిత్రం భళారే విచిత్రం దెబ్బతిన్నాయి. ఇక సంక్రాంతి టెన్షన్ పెడుతూ ఒకేసారి నాలుగు చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. సుకుమార్ ఫాదర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ నటనను పిండి నాన్నకు ప్రేమతో అందించగా, మేర్లపాక గాంధీ తన ఎంటర్ టైన్ ను కంటిన్యూ చేస్తూ శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా, శ్రీవాస్ బాలయ్య తో డిక్టేటర్ (కాస్త కలెక్షన్లు తక్కువ) హిట్లు కొట్టారు. ఇక కళ్యాణ్ కృష్ణ డెబ్యూతోనే నాగ్ తో సోగ్గాడే చిన్నినాయన ఫర్ ఫెక్ట్ సంక్రాంతి హిట్ అందుకున్నాడు.

బిగ్ డైరక్టర్ల విషయానికొస్తే... బోయపాటి సరైనోడు, త్రివిక్రమ్ అ..ఆ... తో, కొరటాల శివ జనతా గ్యారేజ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. వీఐ ఆనంద్ ఎక్కడకి పోతావ్ చిన్నినాయనలతో, సురేందర్ రెడ్డి తనిఒరువన్ రీమేక్ గా చెర్రీతో థ్రిల్లర్ డ్రామా ధృవను తీసి బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. బాబీ సర్దార్ గబ్బర్ సింగ్ తో, శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. వర్మ కిల్లింగ్ వీరప్పన్ అనువాద చిత్రంతో కాస్త అలరించినప్పటికీ, అటాక్, వంగవీటిలతో పెద్ద దెబ్బే వేశాడు. గౌతమ్ మీనన్ సాహసం శ్వాసగా సాగిపో.. ఇజంతో పూరీ, సత్తిబాబు మీలో ఎవరు కోటీశ్వరుడు, శౌర్యతో దశరథ్, మారుతి బాబు బంగారం అలరించలేకపోయారు.

అప్ కమింగ్ దర్శకులలో తరుణ్ భాస్కర్ ఈ యేడాది పెళ్లి చూపులతో ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు. విజయ్ దేవరకొండ-రీతూవర్మలతో సున్నితమైన ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ కమ్ యూత్ ఫుల్ ఇన్సిపిరేషన్ కథను రూపొందించి సంచలనంగా నిలిపాడు. బిచ్చగాడు రీమేక్ తో శశి బిగ్గెస్ట్ ఈ యేడాది బిగ్గెస్ట్ అందుకోగా, మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రం ద్వారా విజయ్ ఆంటోనీకి స్టార్ స్టేటస్ కట్టబెట్టింది. కృష్ణగాడి వీరప్రేమగాథతో అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి సున్నితమైన లవ్ స్టోరీ అందుకుని తొలి హిట్ రుచిచూశాడు, రవికాంత్ క్షణంతో, నందిని రెడ్డి కళ్యాణ వైభోగంతో, అనిల్ రావిపూడి సుప్రీమ్ తో, జెంటిల్మెన్ తో ఇంద్రగంటి మోహన కృష్ణ, జ్యో అచ్యుతానందతో అవసరాల శ్రీనివాస్, పరుశురాం శ్రీరస్తు శుభమస్తు, చందూ మొండేటి ప్రేమమ్ రీమేక్ మంచి ఎంటర్ టైనర్ లను అందించారు. విరించి వర్మ మజ్నుతో, జీ నాగేశ్వర్ రెడ్డి ఈడో రకం-ఆడో రకం మాస్ ను ఉర్రూత లూగించాయి.

సతీష్ కాశేట్టి టెర్రర్, చంద్రశేఖర్ యేలేటి మనమంతా, శివరాజ్ కనుమూరి జయమ్ము నిశ్చయమ్మురా లు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆపై కిల్లింగ్ వీరప్పన్ విమర్శకు ప్రశంసలు అందుకుంది. యంగ్ డైరక్టర్లకు కొందరికి ఏ మాత్రం కలిసిరాలేదు. చివరగా రిలీజైన అప్పట్లో ఒకడుండేవాడు ఏడాది లాస్ట్ హిట్ టాక్ సంపాదించుకోంది. మరి ఈ చిత్రాల్లో ప్రేక్షకులు దేనికి పట్టం కడతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood-2016  best movie  tollywood movies list  

Other Articles