నెగటివ్ రివ్యూలతో ఏడ్చేశాడు.. ఆలీ చెప్పినట్లు చేస్తాడంట! | Saptagiri wise decision after debut movie failure.

Sapatagiri emotional at saptagiri express success meet

Actor Saptagiri, Saptagiri Cry, Actor Saptagiri whip, Saptagiri Express Movie Success meet, Saptagiri at Saptagiri Express Movie Success meet, Saptagiri Express Movie collections, Saptagiri Express Success meet, Saptagiri wants to continue as Comedian, Saptagiri follows Ali Idea

Actor Saptagiri Whipped over negative reviews at Saptagiri Express Movie Success meet.

సప్తగిరి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు

Posted: 12/27/2016 03:06 PM IST
Sapatagiri emotional at saptagiri express success meet

తొలి ప్రయత్నంతో సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగా మారిన కమెడియన్ సప్తగిరి విమర్శకులను మాత్రం మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ బీ, సీ సెంటర్ ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చిపడుతున్నాయి. సప్తగిరి కామెడీ మీద నమ్మకంతో జనాలు కాస్త క్యూ కడుతున్నారు. అయితే టోటల్ గా ఫస్ట్ షో నుంచే సినిమాపై నెగటివ్ రివ్యూలు రావటంతో ఆ ప్రభావం మాత్రం సినిమాపై పడిందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాకు రీసెంట్ గా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. అందులో బాగా ఎమోషనల్ అయ్యాడు ఈ కమెడియన్ టర్న్ హీరో. తామెంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు ప్రతికూలంగా రాశారంటూ ఏడ్చేశాడు. హీరో తాను చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. దర్శకుడిని కావాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి వచ్చి నటుడిని అయ్యానని వెల్లడించారు. ఎప్పటికైనా డైరెక్షన్‌ చేస్తానని స్పష్టం చేశాడు.

అంతేకాదు ప్రస్తుతం తాను మునుపటిలాగే కమెడియన్ గా కొనసాగుతున్నానని, మధ్యలో ఏవైనా మంచి స్క్రిప్ట్ లు వస్తే మాత్రం మళ్లీ హీరోగా చేసే విసయమై ఆలోచిస్తానన్నాడు . ఇక సినిమా కలెక్షన్ల గురించి నిర్మాత రవికిరణ్ వివరిస్తూ... మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలిపాడు. అన్ని ప్రాంతాల్లో తమ సినిమాకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోందని అంటున్నాడు. మొత్తానికి హీరోగా తొలి అటెంప్ట్ విఫలం కావటంతో సప్తగిరి మళ్లీ కామెడీ వేషాల నిర్ణయం తీసుకుని మంచి పని చేశాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saptagiri Express  Success meet  Saptagiri cry  

Other Articles