ఎక్స్ పోజింగ్ అంటే ఆ ఇద్దరికే ఎందుకు మండింది? | Suraaj apologises for sexist comments

Director suraaj apologises for sexist comments

Nayanatara, Tamannaah Bhatia, Director Suraaj, Suraaj Tamanna, Suraaj Nayanatara, Suraaj sexiest comments, Kollywood director Suraaj, Suraaj apology, Suraaj movies, Suraaj exposing comments

Nayanatara, Tamannaah Bhatia Lashes Out At Suraaj's Sexist Comment On Heroines. Later he apologized.

నయన్, తమ్మూ వార్నింగ్ పని చేసింది

Posted: 12/27/2016 02:34 PM IST
Director suraaj apologises for sexist comments

తన నోటి దూలతో నిన్నటి నుంచి కోలీవుడ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న దర్శకుడు సూరజ్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. హీరోయిన్ల బట్టలు ఎంత తక్కువ వేసుకోవాలన్న దానిపైనే కాంసంట్రేషన్ చేస్తున్నారని, నటన పట్టించుకోవట్లేదంటూ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

కేవలం హీరోయిన్స్ ను ఎక్స్ పోజింగ్ కోసమే మాత్రమే సినిమాల్లోకి తీసుకుంటున్నామని, వాళ్లు ఎంత చూపిస్తే మాస్ జనాలకు అంత కిక్' అంటూ సూరజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో చిర్రెత్తకొచ్చిన నయనతార సూరజ్ ను ఎడా పెడా వాయించేసింది. 'మేమేమీ స్ట్రిప్పర్స్ కాదు' అంటూ తిట్టిపోసింది. ఇక మరో హీరోయిన్ తమన్నాకి ఈ విషయం తెలిసి 'ఆ దర్శకుడు సారీ చెప్పాల్సిందే.. లేకపోతే పరిస్థితి చాలా దూరం వెళుతుంది' అన్నట్లుగా బెదిరించేసింది.

ఇండస్ట్రీ నుంచి కూడా ఈ దర్శకుడి కామెంట్స్ కి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగొచ్చిన ఈ దర్శకుడు.. క్షమాపణలు చెప్పాడు.  సూరజ్ తన ట్విట్టర్ ఖాతాలో సారీ చెప్పేశాడు. అంతేకాదు నడిగర్ సంఘానికి ఓ క్షమాపణ పత్రం కూడా రాశాడు. ' తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోయిన్స్ అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. వారి సెంటిమెంట్స్ ను దెబ్బ తీయాలని అనుకోలేదు. మరోసారి సారి చెబుతూ నా కామెంట్స్ ను వెనక్కి తీసుకుంటున్నా' అన్నాడు సూరజ్. 

 

కాగా, సూరజ్ విశాల్ హీరోగా తీసిన ఒక్కడొచ్చాడు దర్శకుడు. సినిమా అక్కడా, ఇక్కడా రెండు చోట్ల అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చెత్త సినిమాలతో విసిగిస్తాడంటూ సూరజ్ ను కోలీవుడ్ జనాలు తిట్టిపోస్తుంటారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Director  Suraaj  Tamanna  Nayanatara  Exposing Coments  Sorry  

Other Articles