భాయ్ జాన్ బర్త్ డే లో ప్యార్ జాన్(?) లూలియా | Iulia Vantur in Salman Birthday bash.

Salman khan 51 birthday special guest

Salman Khan, Salman Khan 51 birthday celebrations, 51 salman birthday, Lilia Vantur Salman Birthday, Salman Khan Birthday special, Salman Khan special Story, Salman Lulia love, Salman Khan Lulia Love, Salman Khan Lulia birthday, Lulia Vantur Salman Khan

Salman Khan's rumoured girlfriend Iulia Vantur at his 51st birthday celebrations.

సల్మాన్ బర్త్ డే లో లూలియా దర్శనం

Posted: 12/27/2016 04:30 PM IST
Salman khan 51 birthday special guest

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అకా సల్లూ భాయ్(ఈ పేరు వింటే అతనికి కాలిపోతుంది జాగ్రత్త) వయసు మరో ఏడాది పెరిగిపోయింది. డిసెంబర్ 27న ఈ కండల వీరుడు 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన అతనికి లైఫ్ పార్టనర్ మాత్రం దొరకలేదు. ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గానే మనోడు కొనసాగుతున్నాడు.

ఇక తన పాన్ వెల్ ఫాం హౌస్ లో బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. దానికి సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్స్ ఖాందాన్ మొత్తం హాజరయ్యింది. అంతకు ముందు అల్లుడు అహిల్ తో కేక్ కట్ చేయిస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అక్కడే అసలు విషయం ఉంది.

ఫోటోలో సల్మాన్ పక్కన అతని అమ్మ సల్మా ఖాన్ ఉందంటే ఓ అర్థం.. మరి ఆ పక్కనే ఉంది ఎవరో గుర్తుపట్టారా? ఇంకెవరూ? సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్ అని గగ్గోలు పెడుతున్నారే.. ఆ ఐరిష్ బ్యూటీ లూలియా. ఎంచక్కా సల్మాన్ కేక్ కట్ చేస్తుంటే... తన ఫోన్ లో ఫోటోను తీస్తోంది. ఇది చూసిన వారంతా రూమర్లు వచ్చాక కూడా ఆ ఫ్యామిలీతో ఇంత క్లోజ్ గా ఉందంటే... జస్ట్ ఫ్రెండ్ అంటే ఇప్పటికైనా నమ్ముతారా?

 

ఇదిలా ఉంటే భాయ్ జాన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పలువురు సెలబ్రిటీలు క్యూ కట్టేస్తున్నారు. పనిలో పనిగా తెలుగు విశేష్ తరపున మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం మరీ. హ్యాపీ బర్త్ డే టూ సల్మాన్ ఖాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  51 birthday  Lulia Vantur  

Other Articles