ఖైదీ కోసం క్లోజ్ ఫ్రెండ్స్ ను వాడేస్తున్న చెర్రీ | Cherry using close friends helps to Khaidi.

Two young heroes for khaidi pre release function

Rana and Navadeep, Cherry friends for Khaidi, Khaidi No 150, Khaidi No 150 pre release function, Khaidi No 150 third song, Chiru 150 movie, Chiranjeevi Khaidi No 150, Rana and Navadeep hosting, Rana and Navadeep anchors for Chiru, Two youngsters host, Khaidi No 150, Khaidi third song

Mega Event: Rana and Navadeep turns To Host for Khaidi No 150 Pre release function.

చిరు కోసం కాదు చెర్రీ కోసమే...

Posted: 12/27/2016 01:32 PM IST
Two young heroes for khaidi pre release function

మెగాస్టార్ విడుదలైన ఖైదీ రెండు పాటలు ఇంటర్ నెట్ లో దుమ్ము రేపుతున్నాయి. ముఖ్యంగా అమ్మడు పాట గురించి లహరి మ్యూజిక్ సంస్థ స్వయంగా ఓ ప్రకటన చేసిందంటే ఏ రేంజ్ లో కుమ్ముకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆడియో పంక్షన్ లేకపోవటంతో పాటల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ కి తెర దించుతూ రోజుకో పాట రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ క్రమంలో మూడవ పాట రేపు సాయంత్రం రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే 4వ తేదీ జరగబోయే ప్రీ రిలీజ్ పంక్షన్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారు ఇద్దరు యువ నటులు. ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వీరిద్దరూ వ్యవహరించబోతున్నారు. ఒకరు హ్యాండ్సమ్ హంక్ రానా కాగా, మరోకరు నవదీప్. మెగా ఫ్యామిలీతో రిలేషన్, ముఖ్యంగా చెర్రీతో చిన్నప్పటి నుంచి రానాకు అనుబంధం ఉండటం తెలిసిందే. ఇటీవలె చెర్రీతో ధృవలో ఓ పాత్రలో పోషించి మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తున్నాడు నవదీప్. ఈ ఇద్దరు యువ హీరోల మూలంగా కార్యక్రమానికి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

 

ఇక పంక్షన్ కి పవర్ స్టార్ హజరవ్వటం గురించి ఇంత వరకు ఎక్కడా ప్రస్తావన లేదు. అయితే గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ వేడుకకు చిరు హాజరయ్యాడు కాబట్టి ఖచ్ఛితంగా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక చిరు ల్యాండ్ మార్క్ చిత్రం కావటంతో ఎలాగైనా మెగా హీరోలంతా ఒకే వేదికపై ఉండేలా నిర్మాత చెర్రీ కూడా ప్లాన్ చేస్తున్నాడంట. అదండీ ఖైదీ కొత్త ఫ్లానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Pre release function  Rana and Navadeep  Anchors  

Other Articles