వంగవీటిని ఆ కోణంలో ఎందుకు చూస్తున్నారు-వర్మ | RGV's Vangaveeti no caste controversy.

No controversy in rgv s vangaveeti

vangaveeti Movie, vangaveeti controversy, Kapu caste Vangaveeti, RGV on Kapu caste issue, Vangaveeti Varma, Varma Vangaveeti interview, Kapu caste not insulted in Vangaveeti, I am not insult kapu caste in Vangaveeti, Vangaveeti Human rights commission,

Ram Gopal Varma condemns that he insult Kapu caste in vangaveeti.

వివాదం చేసేంత సీన్ వంగవీటిలో లేదా?

Posted: 12/24/2016 05:18 PM IST
No controversy in rgv s vangaveeti

వర్మ వంగవీటి సినిమా విడుదలై యావరేజ్ టాక్ మూటగట్టుకుంది. అయితే కావాలనే కొందరు పనిగట్టుకుని సినిమా టాక్ చెడగొడుతున్నారని అంటున్నాడు ఈ వివాదాల దర్శకుడు. సినిమా రిలీజ్ అయ్యాక కొందరు రంగను విలన్ గా చూపించారంటూ.. కులాన్ని హేళన చేశారంటూ ఇలా ఎవరి వర్షన్ లో వాళ్లు విమర్శలు వినిపించారు. అది క్రమంగా సినిమాపై కూడా పడింది. దీంతో రంగంలోకి దిగిన వర్మ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

తానేం అధ్యయనం మొత్తం అధ్యయనం చేయలేదని, తాను విన్నది, కొందరు చెప్పింది మాత్రమే ఓ సినిమాగా అల్లుకుని తీశానని అంటున్నాడు. వంగవీటిని విలన్ గా చూపించాలనో లేక దేవినేని ఫ్యామిలీని పాజిటివ్ లో చూపించాలన్న ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చాడు. కాంట్రవర్సరీలతో క్యాష్ చేసుకోవాలనుకుంటే తాను వేరే జోనర్ సినిమాలు తీసేవాడిని కదా అని అంటున్నాడు. గాంధీ కథ కన్నా నాకు వంగవీటి కథే బాగా అనిపించింది. అందుకే దానిని సినిమాగా మలిచా. నేను సిద్ధార్థ కాలేజీలో చదువుకునే రోజుల్లో కొన్ని ఘటనలు చూశాను. వాటిని కూడా ఇందులో చేర్చాను. పిరియాడిక్ ఈవెంట్లలాగా కాకుండా మొత్తం ఒకే టైంలో జరిగినట్లుగా వరుసగా చూపించాను. ఇక్కడ లాజిక్కులు కూడా వెతకాల్సిన పని లేదన్నాడు.

ఇంకా కొందరు కులాన్ని కించపరిచానని అంటున్నారు. కానీ, కుల ప్రస్తావన ఎక్కడా లేకుండా సినిమా తీశానని మీరే(యాంకర్ ను ఉద్దేశించి) అంటున్నారు. ఇది చాలదా? నేను వివాదాస్పదంగా సినిమా తెరకెక్కించలేదని చెప్పటానికి అంటూ తెలిపాడు. మొత్తానికి తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని, అలాగని ఉన్నది ఉన్నట్లు చూపించానని కూడా చెప్పటం లేదని, తనక్కూడా క్లారిటీ లేకపోవటంతోనే వంగవీటి మరణంను మిస్టరీగా వదిలేశానని అంటున్నాడు.

హెచ్ ఆర్సీలో ఫిర్యాదు...
అయితే వంగవీటి రంగా అభిమానులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. సంఘం శనివారం మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘వంగవీటి’ చిత్రంలోని పలు సన్నివేశాలు కాపుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని రంగా అభిమానుల సంఘం కోరింది.

ఈ ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ....జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సెన్సార్‌ బోర్డును ఆదేశించింది. కాగా ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిన్న ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రాంగోపాల్‌వర్మ పరిగణనలోకి తీసుకోలేదని, సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Vangaveeti  Kapu controversy  

Other Articles